ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (Overseas Manpower Company Andhra Pradesh Limited: OMCAP) అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ మంది ఆంధ్రాయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఒం క్యాప్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏర్పాటయింది. తెలుగు యువతీ యువకుల అక్రమ ఏజన్సీల బారిన పడి నష్టపోకుండా ఉండేందుకు, వారికి విదేశాలలో చట్ట బద్ధంగా, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ సంస్థ ఏర్పాటు చేశారు. విదేశీ సంస్థలు, ప్రభుత్వాలు నైపుణ్యం ఉన్న ఉద్యోగాలుకావాలనుకుంటే, ఈ సంస్థ ను సంప్రదిస్తే, వారికి సరైన శిక్షణ ఇవ్వడమే కాదు, ఆదేశాలలో పనిచేసేందుకు అవసరమయిన సాంస్కృతిక వ్యవహారాలలో కూడా శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ఉద్దేశం. ఇపుడు ఈ సంస్థకు డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ ఎండి (MD OMCAP)గా ఉంటున్నారు.
1) అంతర్జాతీయ మార్కెట్ లో రాబోయే ఉద్యోగ అవకాశాలను ఎప్పటికప్పుడు అంచనా వేయడం, ముఖ్యంగా కరోనా ఉధృతి తగ్గిన తర్వాత హెల్త్ సెక్టార్ లో నర్సులు, డాక్టర్లు, ఇతర ఆరోగ్య నిపుణుల సమాచారం ఎప్పటికప్పుడు సేకరించాలి.
సంబంధిత ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా వంటపని, టెక్నీషియన్స్, మహిళా పనిమనుషులకు అవకాశాలు ఉంటున్న నేపథ్యంలో అక్కడ పనిచేయడానికి అవసరమైన విధంగా మనవారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు భద్రతతో కూడిన ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకోవాలి.
2) విదేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే పలువురు వర్కర్లకు వారి నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా ఓవర్సీస్ స్కిల్స్ రిజిస్టర్ ను తయారు చేయాలి. ఆసక్తి, అనుభావాన్ని బట్టి మన రాష్ట్రంలో కానీ లేదా దేశ విదేశాలలో కానీ వారికి అవసరమైన ఉద్యోగ సహకారం అందించాలి.
3) ప్రస్తుతం ఉన్నటువంటి ఓం క్యాప్ వెబ్ సైట్ ను మరింత ఆధునీకరించి విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మెరుగైన సేవలు అందించేలా చూడాలి.
4) జూలై నెలలో మన దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారుల సహకారంతో గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయాల్లోని అంబాసిడర్లతో సంప్రదించి రాష్ట్రంలో అమలవుతున్న నైపుణ్యశిక్షణా కార్యక్రమాల గురించి వారికి తెలియపరచాలి.
తద్వారా ఎక్కువ మంది విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం జూలై నెలలో మినిస్టర్ / చైర్మన్ మేకపాటి గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ఒక బృందం గల్ప్ దేశాల్లో పర్యటించేలా ప్రణాళిక సిద్దం చేయాలి.
5) జపాన్, స్వీడన్, ఇటలీ, జర్మనీతోపాటు యూరప్ దేశాల్లో పెద్ద సంఖ్యలో ఉగ్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని, వాటిని మన రాష్ట్రంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, టెక్నీషియన్లు, ఇతర నైపుణ్యాలు ఉన్నవారు పొందేలా ఓంక్యాప్ కృషి చేయనుంది