తెలంగాణలో వైద్యసిబ్బందికి కరోనా సోకడం పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
కరోనా విధుల్లో ఉన్న డాక్టర్లకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ ( పీపీఈ) కిట్లు ఇవ్వడం లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పిపిఇ కిట్లు ఇస్తే వైరస్ ఎలా సోకిందంటూ ప్రశ్నించింది.
రాష్ట్రంలో సరిగ్గా కరోనా పరీక్షలుచేయకం పోవడం మీద, సరైన భద్రత కల్పించకపోవడంతో డాక్టర్లకు కరోనా సోకడం మీద ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు దాఖలుచేసిన ఒక పిటిషన్ ను హైకోర్టులో విచారణకు స్వీకరించింది.పిటిషన్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ మొత్తంగా రాష్ట్రంలో 34 మంది వైద్యులు వైరస్ బారినపడ్డారని కోర్టు కు తెలిపారు. కరోనా విధుల్లో ఉన్న డాక్టర్లకు కిట్లు తగినన్ని ఇవ్వడం లేదని పిటిషన్ తెలిపారు.
డాక్టర్ల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యల మీద జూన్ 8లోగా ఒక నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గత మూడు రోజుల్లో ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిధిలో కరోనా విధులు నిర్వరిస్తున్న 23 మంది మెడికోలు కరోనా పాజిటివ్ గా తేలినసంగతి తెలిసిందే. వారందరిని విధులనుంచి తప్పించి గాంధీ ఆసుపత్రికి తరలించారు ఉస్మానియా మెడికోలతో పాటు నిమ్స్ కు చెందిన నలుగురు సీనియర్ కార్డియాలజిస్టులకు ముగ్గురు CATH ల్యాబ్ టెక్నిషియన్లకు కరోనా సోకింది.