లాక్ డౌన్ సడలింపులు అమలులోకి రావడం, దేవాలయాలలోకి భక్తులను అనుమతించవచ్చని కేంద్రం చెప్పడం తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ దేవస్థానాలు దేవుళ్ల దర్శనాలకోసం ఏర్పాట్లు చేస్తున్నాయి.
తెలుంగాణలోని యాదగిరిగుట్ట సకల సౌకర్యాలను భక్తులో కోసం సిద్ధం చేస్తున్నది.
జూన్ నెల 8 నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనంతోపాటు ఆర్జిత పూజల నిర్వహణ కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
అయితే, కొండ మీదికి వాహనాలను అనుమతించరు. భక్తులు కాలినడకన కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది.
దర్శనాల పునరుద్ధరణ కోసం మంగళవారం యాదాద్రిలో అధికారులు సమావేశమయ్యారు. స్వామి దర్శనానికొచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ఆలయ ఇవొ ఎన్ గీత తెలిపారు.
కొండ కిందినుంచి పై వరకు దారిపొడుగునా భక్తులు భౌతికదూరం పాటించాలి.దీనితకోసం బాక్సులను ఏర్పాటుచేశారు.
ఒక వారంపాటు ప్రయోగాత్మకంగా దర్శనాల ప్రక్రియను పర్యవేక్షిస్తారు..
గతంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల కోసం ఒక్కో బ్యాచ్‌కు ఒక హాల్లో 250 జంటలు కూర్చునేలా అనుమతించేవారు. ఈ నెల 8 నుంచి ఒక్కో బ్యాచ్‌లో 50 మంది దంపతులు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లుచేస్తున్నారు.
ఇలాగే శ్రీవారి కల్యాణం జరిపించుకునేందుకు గతంలో 200 మంది దంపతులను అనుమతించేవారు. ప్రస్తుతం 25 మంది దంపతులే కూర్చుంటారు. దర్శనాలు గత టైంటేబుల్ ప్రకారమే జరుగుతాయి.
యాదాద్రి దర్శనాలకు పదేండ్లలోపు పిల్లలు, 65 ఏండ్లుపైబడిన వృద్ధులకు అనుమతిలేదు. ఈ విషయాన్ని ఈవో గీత ప్రకటించారు.
One thought on “యాదాద్రి గుడి తలుపు తెరచుకుంటున్నాయ్, పిల్లలు, వృద్ధులు నిషేధం”
One thought on “యాదాద్రి గుడి తలుపు తెరచుకుంటున్నాయ్, పిల్లలు, వృద్ధులు నిషేధం”
Comments are closed.