భవిష్యత్ లో దొంగలు పాలకులు అవుతారని బ్రహ్మం గారు చెప్తే ఎవరి గురించో అనుకున్నాం, కానీ ఆయన చెప్పింది జగన్, వైసీపీ నేతల గురించేనని ప్రజలకు ఇప్పుడు అర్ధమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి , మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. నవరత్నాలు పేరు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలోని సహజ వనరులన్నీ లూటీ చేస్తున్నారు. చివరికి ఇసుక, మట్టి కూడా అమ్ముకుంటున్నారు.ప్రజలకు నవరత్నాలు పంచుతామని వైసీపీ నేతలు పంచ భూతాలను పంచుకుతింటున్నారు.
టీడీపీ హయాంలో ఉచితం గా ఇసుక ఇస్తే నేడు ఇసుక కావాలంటే వైసీపీ నేతలకు ప్రజలు కమిషన్లు ఇవ్వాల్సి వస్తోంది. రీచ్ లో ఎత్తిన ఇసుక ఇంటికి చేరకుండా మధ్యలోనే మాయమవుతోందని వైసీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారంటే వైసీపీ నేతల ఇసుక దోపిడీ ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. వైసీపీ పాలనలో ఇసుక కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక రూ 25నుంచి రూ30 వేల వరకు ధర పలకగా నేడు లారీ ఇసుక రూ 60 వేలనుండి 70 వేల వరకు వసూలు చేస్తున్నారు.
పేదలు ఇసుక కొనలేక ఇళ్ళ నిర్మాణం మద్యలోనే ఆపేసి మొండి గోడల్లో తలదాచువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి వచ్చినందుకు వైసీపీ నేతలు సిగ్గుపడాలి. ఇసుక దోపిడికి అడ్డుకట్ట వేసి ఇసుక సామాన్యులకు పూర్తిగా అందుబాటులోకి రావడానికి ప్రభుత్వం దృష్టి సారించాలి. లేకపోతే ఇసుక తుఫానులో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం కాయం.
దళితులు టీడీపీ కి అండగా ఉన్నారన్న అక్కసుతో వైసీపీ ప్రభుత్వం దళితులపై కక్ష్య సాదింపు చర్యలకు పాల్పడుతోంది. మాస్కుల్లేవని అడిగిన దళిత డాక్టర్ సుధాకర్‌ని ఉగ్రవాది కంటే ఘోరంగా హింసించి బంధించారు. పిచ్చివాడిగా ముద్ర వేసి మెంటల్ హాస్పిటల్ లో చేర్చారు. కచ్చులూరు బోటు ప్రమాదానికి కారణమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో కుల వివక్ష తో దళిత లెక్చరర్ ప్రేమానందంపై దాడి చేయడం హేయం. గ్రామాల్లో దళితుల భూములు వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు. పలు చోట్ల భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. దళితులపై వైసీపీ కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలి.
(కళా వెంకట్రావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు,విడుదల చేసిన ప్రకటన యథాతథంగా అందించాం)