ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం మొదలయింది. ఒకేసారి ఏకంగా 12 మంది పోస్టుగ్రాజుయేట్ డాక్లర్లు కరోనా పాజిటివ్ అని తేలింది. మరొక 170 మంది విద్యార్థుల శాంపిళ్లను కూడా పరీక్షలకు పంపించారు.వాటి ఫలితాలు ఇంకా రావలసి ఉంది.ఈ పన్నెండు మందిలో అయిదుగురు పాజిటివ్ అని మంగళవారం నాడు తేలింది.
వీళ్లకి కరోనా ఎలా సోకిందంటే…
పేట్ల బురుజ్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ లో ఒక క్యాంటిన్ వుంది. అందులో పనిచేస్తున్న ఒక వర్కర్ కు కొద్ది రోజులుగా జ్వరం జలుబుతో బాధపడుతున్నాడు. అయినా సరే అతనువిధులకు వచ్చాడు. పోస్టు గ్యాజుయేట్ వైద్యవిద్యార్థులంతా ఆ క్యాంటీన్ లో టీ తాగే వారు. దీనివల్లే వారందకి కరోనా సోకిందని చెబుతున్నారు. ఈ వర్కర్ మే 29న కరోనా పాజిటివ్ అని గుర్తించారు. ఇపుడాయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అనేక మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా సోకడంతో ఆసుపత్రులలో పనిచేసవారందరికి రెగ్యులర్ గా పరీక్షలు నిర్వహించాలని, వారికి పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు ఇవ్వాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోయేషేన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.