రాయలసీమ సాగునీటి ప్రాజక్టులు పూర్తి చేసి, వాటికి నికరజలాలు కేటాయించాలని కల్యాణ దుర్గం రాయలసీమ సాంస్కృతిక వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఇదే విధంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో జీడిపల్లి-కుందుర్పి- బైరవానితిప్ప బ్రాంచ్ కెనాల్, హగరి బ్రాంచ్ కెనాల్, కళ్యాణదుర్గం కమ్యూనిటీ డ్రిప్ ఇరిగేషన్ తదితర పథకాలు తక్షణం పూర్తి చేసి చెరువులకు, ఆయకట్టకు నీరివ్వాలని వేదిక కోరింది. హెచ్.యల్.సీ సమాంతర కాలువ కళ్యాణదుర్గానికి అనుసంధానం చేయాలని కూడా వేదిక డిమాండ్ చేసింది.
సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు కళ్యాణదుర్గం పట్టణంలో.. “రాయలసీమ సాంస్కృతిక వేదిక” ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ డిమాండ్లు చేశారు.
సీమలోని నదులను పునరుజ్జీవనం చేయాలని, రాయలసీమ ప్రాంతావసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రాజక్టులను రూపొందించేందుకు, వాటిని సకాలంలో పూర్తి చేేసేందుకువీలుగా ఈ ప్రాంతానికి ప్రత్యేక ఇరిగేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని సమావేశం ఒక తీర్మానం ఆమోదించింది.
ఈ కార్యక్రమంలో రాయలసీమ సాంస్కృతిక వేదిక కన్వీనర్ డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, కళ్యాణదుర్గం నీళ్ళ సాధన సమితి సభ్యులు డా.దేశం శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున బాబు, ప్రసాద్,నారాయణరెడ్డి, లక్ష్మయ్య, వినియోగదారుల సంఘం నాయకులు చల్లా కిషోర్, గురజాడ అధ్యయన కేంద్రం సభ్యులు మల్లికార్జున, ప్రదీప్, స్వచ్చంద సంఘాల ప్రతినిధి నటరాజ్, ఉపాద్యాయులు సంఘ ప్రతినిధులు రాధాకృష్ణ, నరసింహారెడ్డి, జగన్ మోహన్ రెడ్డి , విద్యార్థి సంఘం నాయకులు అచ్యుత్ ప్రసాద్,బాలజీ,రైతు సంఘం నాయకులు లక్ష్మిరెడ్డి, గంగాధర, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
గుంటకల్ లో సమావేశం
సిద్దేశ్వరం అలుగు నాలుగవ శంకుస్థాపన వార్షికోత్సవం సందర్భంగా రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా జలసాధన సమితి. రాయలసీమ సాగునీటి సాధన సమితి. రాయలసీమ ప్రజా సంఘాల పిలుపు మేరకు ఈరోజు గుంతకల్ పట్టణంలో పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా చేసిన తీర్మానాలు:
సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని చేపట్టాలి.
హంద్రీనీవా కాలువ నుంచి రోజుకు రెండు టీఎంసీలు నీళ్లు వచ్చేలా కాలువ ను వెడల్పు చేయాలి.
పోతిరెడ్డిపాడు సామర్థ్యం 80 వేల క్యూసెక్కుల కు పెంచే జీవో 203 ను వెంటనే అమలు పరచాలి.
హంద్రీనీవా గుంతకల్ మండలంలో పిల్ల కాలువలను ఏర్పాటు చేస్తూ ఆయకట్టును పెంచాలి
రాగులపాడు దగ్గర నుండి లిఫ్ట్ ద్వారా తూమును ఏర్పాటు చేసి. నాగసముద్రం వరకు కాలువచేసి. చెరువులకు నీళ్లు నింపాలి…
సాగు నీటి సమస్యలను.. నిర్మాణాలను చేయాలని ప్రభుత్వమును డిమాండ్ ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగినది..
ఈ కార్యక్రమంలో జలసాధన సమితి గుంతకల్ కార్యదర్శి బి. సురేష్ కమిటీ సభ్యులు చిన్నా. రఘునాథ్ రెడ్డి. గోపాల్. రామాంజనేయులు. షేక్షావలి. రమణారెడ్డి. గోపి. జిలాన్. శ్రీరాములు. రవి. రాజు తదితరులు పాల్గొన్నారు.