రాయలసీమ నీళ్ళ పోరాటానికి సంఘీభావం ప్రకటించండి

రాయలసీమకు గుండెకాయ సిద్దేశ్వరం అలుగు. సీమ రైతులు, ప్రజాసంఘాలు 31-మే 2016 న స్వచ్చందంగా ముఫ్ఫై వేల మందితో అలుగు కోసం ఉద్యమించిన విషయం మీ అందరికీ తెలిసిందే. సీమ నీళ్ళ పోరాటంలో ఇది ఒక మైలురాయి లాంటిది.

https://trendingtelugunews.com/telugu/rayalaseema-fight-for-siddheswaram-alugu-bojja-dasaratha-rami-reddy/

సిద్దేశ్వరం అలుగు ప్రజా శంఖుస్థాపన నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 31-మే 2020 న ఉదయం 10-00 గంటలకు రాయలసీమలో వందల కేంద్రాలలో సీమ నీళ్ళ చైతన్య కార్యక్రమాన్ని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక పిలుపునిచ్చింది.

https://trendingtelugunews.com/telugu/siddheswaram-padayatra-gets-rousing-reception-along-the-way/

ఈ చారిత్రాత్మక సందర్భంలో సాహిత్య, సాంస్కృతిక సంఘాలు తమ సంస్థల ఆధ్వర్యంలో సంఘీభావం ప్రకటిస్తూ రేపటి రోజు 31 ఆదివారం నాడు తమ పరిధిలో అవకాశం ఉన్న కార్యక్రమాలు చేయాలని మనవి చేస్తున్నాము. సంఘాలు లేకున్నా వ్యక్తిగతంగా అయినా పూనుకోవాలని కోరుతున్నాం.

https://trendingtelugunews.com/telugu/rayalaseema-march-of-siddeshwaram-poject-to-begin-from-nandyal-tomorrow/

చార్ట్ పై సీమ నీళ్ళ సమస్యలు, స్థానిక నీళ్ళ అవసరాలను తమ సంఘం పేరుతోనే రాసుకోవడం, అవకాశం ఉన్న మేరకు పది మందిని కలపడం, వీలైతే పచ్చజెండాను సిద్ధం చేసుకోవడం.ఇలా సాధ్యమైనంత వరకు కృషి చేసి చిన్న సమావేశాలైన ఏర్పాటు చేయాలని మనవి చేస్తున్నాం.
ఏ సీమ జీవితాల కోసం రాస్తున్నామో..ఆ జీవితాలలో మార్పుల కోసం జరిగే ప్రజా ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించండి
ఇట్లు…
రాయలసీమ సాంస్కృతిక వేదిక,
రాయలసీమ సాగునీటి సాధన సమితి,
రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సభ్యసంస్థలు.

https://trendingtelugunews.com/telugu/kcr-should-first-withdraw-his-affidavit/