తెలంగాణ మెదక్ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చన్‌పల్లి సాయివర్ధన్ కథ విషాదాంతమైంది. బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన సాయిని కాపాడలేకపోయారు. సాయి వయసు మూడేళ్లు.
గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో 25 అడుగుల లోతు నుంచి బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెలికితీశాయి.ఈ వ్యవసాయ బోర్ బావి లోతు 120 అడుగులు. బుధవారం సాయంకాలం తాత తో కలసి ఆదారిన వెళ్తున్నపుడు సాయి పొరపాటున బోర్ బావిలో పడిపోయాడు.
https://trendingtelugunews.com/english/features/coronavirus-test-rt-pcr-cost-will-haunt-people-post-lockdown/
ఆక్సిజన్ అందకపోవడం వల్లే బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. బోరు బావిలో పడిన సాయి మీద బురద, మట్టి పడి దాదాపు పూడిపోయాడు. అందుకే పైనుంచి ఆక్సిజన్ పంపిన బాలుడికి అందలేదని తెలిసింది. సాయిని రక్షించేందుకు దాదాపు పది గంటలు ప్రయత్నించారు.బోర్ బావికిపక్కనే పెద్ద గోతిని తవ్వి కాపాడు ప్రయత్నం చేశారు. అయితే, అతన్ని చేరుకునే లోపే చనిపోయి ఉన్నాడని పోలీసులు తెలిపారు.
https://trendingtelugunews.com/english/features/pakka-inti-ammayi-padosan-relangi-hero-anjali-heroine/
One thought on “సాయివర్ధన్ కథ విషాదం, బోరు బావి మింగేసింది…”
Comments are closed.