హైదరాబాద్ : మహారాష్ట్ర మీదుగా తెలంగాణ వైపు మిడతలదండు దూసుకువస్తుందేమోనని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మిడతల దండు రాష్ట్రంలో ప్రవేశిస్తే చేపట్టాల్సిన చర్యలపైముఖ్యమంత్రి కెసిఆర్ం అధికారులతో సమీక్షించారు.
మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి దూసుకురాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దులో గల జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు, ఫైర్ ఇంజన్లను, పెస్టిసైడ్లను సిద్ధంగా పెట్టినట్లు చెప్పారు
ఈ దండు బుధవారం నాటికి మహారాష్ట్రలోని అమరావతి చేరుకుందని సమాచారం అందింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ దారిలో కనిపించే ప్రతీ చెట్టూ చేమను తినేసే ఈ మిడుతలను మహారాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేకపోతే రెండు మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రమాదముందని చెబుతున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర అమరావతి జిల్లా వ్యవసాయాధికారులనుంచి, సెంట్రల్ ఇంటెగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్ మెంట్ సెంటర్ల నుంచి తెలంగాణ వ్యవసాధికారులకు సమాచారం అందింది. ఈ మిడతల దండు మహారాష్ట్ర నుంచి గాలివాటం ప్రకారం చత్తీష్ గడ్ వెళ్తే అవకాశం ఉందని, అయితే, దారిలో తెలంగాణ మీద వాలి జామ,మామిడి,అరటి, కూరగాయల తోటల లలో బీభత్సం సృష్టించే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.
మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నిజామాబాద్, కామారెడ్డి, అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్భూపాలపల్లి జిల్లాలకు వీటితో ప్రమాదం పొంచి ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
మిడతల దండు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఒక మిడతల దండు ఒక్క రోజుకు దాదాపు 35000 మందికి సరిపోయే ఆహారాన్ని తినేస్తాయని చెప్తున్నారు.
రాజస్థాన్ లో సుమారు 90 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
మిడతల దండు 1993 మహారాష్ట్ర వైపు వచ్చింది. ఇది రెండువసారి. మే 24 ఇవి మధ్య ప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోకి వచ్చాయి. ఆ రాష్ట్రంలో నాగపూర్ ప్రాంతంలో బత్తాయి, కూరగాలయ పంటలను ధ్వంసం చేశాయి. అమరావతి ఏరియాలో వేపచెట్ల మీద పడ్డాయి. ఇపుడు తెలంగాణ సరిహద్దుకు 400 కి.మీ దూరంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోకి వస్తాయో లేదో చెప్పడానికి మరొక రెండు రోజులు ఆగాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 11న పాకిస్థాన్ నుంచి భారత్లోకి ప్రవేశించి, రాజస్థాన్లోని సగం జిల్లాలకు విస్తరించి, 90 వేల హెక్టార్లలో పంటలను నాశనం చేశాయి.సాధారణంగా ఇవి జూన్ జూలై లలో ఇండియాలోకి రావాలి. అయితే, ఈ సారి ముందుగానే ప్రవేశించాయి.
ఇప్పుడు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహరాష్ట్ర మీదుగా కదులుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఇంగ్లండ్ మైక్రాన్ కంపెనీ నుంచి 60 స్ర్పేయర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నది.వీటి మలాధియాన్ వంటి క్రిమి సంహారక రసాయనాలు వాడేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు.
ఇవి 15 నిమిషాల్లో 2.5 ఎకరాల్లోని మి డతలపై క్రిమి సంహార రసాయనాలను పిచికారిచేస్తాయి. 54 వాహనాల్లో 800కుపైగా స్ప్రేయర్లతో క్రిమిసంహారకాలను పిచికారి చేస్తున్నారు.