ఎన్నో రకాల టాక్స్ లు ప్రజలనుంచి ప్రభుత్వాలు వసూలు చేస్తుంటాయి. కరోనావైరస్ దాడి చేసి లాక్ డౌన్ కు పరిస్థితి విషమించడంతో ఇపుడు పరోక్షంగా ప్రజలందరిమీద కోవిడ్ టాక్స్ లేదా కరోనా టాక్స్ పడింది. చాలాసరుకుల ధరలు పెరిగాయి.
రెండుమూడేళ్ల కిందట, జనమంతా విపరీతంగా ఫాస్ట్ ఫుడ్ కు అలవాటుపడ్డారు. దీనితో శరీరంలో కొవ్వు పెరిగిపోతున్నదని, అది జాతీయారోగ్యం సమస్యగా మారుతున్నదని కొంతమంది పెద్దలు భావించారు. కొవ్వు పదార్థాలు తినకుండనివారించేందుకు భారత దేశంలో ఒక రాష్ట్రం ఫ్యాట్ టాక్స్ విధించింది. ఆ రాష్ట్రమే కేరళ.
2016 లో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఫాస్ట్ ఫుడ్ మీద 14.5 శాతం టాక్స్ విధించి ఫాస్ట్ ఫుడ్ ప్రమాదాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. ఇది కేవలం ప్రమాదకరమయిన ఆహారం తినకుండా ఉండేందుకు తీసుకున్న నిరోధక చర్య మాత్రమేని ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ (Thomas Isaac) చెప్పారు.
This is more a preventive measure as Kerala’s food habits are changing dramatically. People are eating a lot of junk food and rejecting traditional food: Thomas Isaac, Finance Miniter.
కేరళ ఈ చర్య తీసుకునేందుకు బలమయిన కారణముంది. కేరళ అంటేనే హ్యూమన్ డెవెలప్ మెంట్ ఇండెక్స్ (HDI) చాలా విషయాలలో అగ్రభాగాన ఉంటుందనుకుంటాం. నిజమే, కొన్నికీలకమయిన హెచ్ డి ఐ ఇండికేటర్లలోకేరళ అగ్రభాగాన కనిపించినా అంతేకీలకమయిన మరొక విషయంలో కేరళ బాగా వెనకబడి ఉంది. అదొ కొవ్వు. స్థూలకాయం (obesity)లో కేరళ చాలా వెనకబడి ఉంది. కేరళ ప్రజాఆరోగ్యానికి తాజాగ ఎదురువుతున్న ముప్పు స్థూల కాయం. ఈ విషయంలో భారతదేశంలో పంజాబ్ టాప్ లో ఉంటే రెండోస్థానంలో ఉండేది కేరళ. అందులో కూడా మహిళల్లో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ (NCD) పురుషుల్లో కంటే ఎక్కువగా ఉంది. కేరళలోని అచ్యుత మీనన్ సెంటర్ ఫర్ హెల్త్ సైన్సెస్ జరిపిన ఒక సర్వే ప్రకారం కేరళలో 44 శాతం మహిళలలో స్తూలకాయులు. ఇందులో నడుముదగ్గిర స్థూలకాయం ఉన్నవారి సంక్య 71 శాతం. పురుషులకు సంబంధించి అబ్డామినల్ ఒబెసిటీ బాధపడుతున్నవారి సంఖ్య 36 శాతమే. ఈ పరిస్థితే కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని fat tax విధించేలా చేసిందని చెబుతారు. కేరళ కంటే ముందు fat tax విధించిన రాష్ట్రం బీహార్.అయితే బీహార్ లో లగ్జరీ టాక్స్ పేరుతో సమోసా, స్వీట్స్ మీద 13.5 శాతం టాక్స్ విధించారు. కిలో రు. 500 ధర దాటిన వాటన్నింటికి ఈ టాక్స్ వర్తిస్తుంది.
కరోనా పుణ్యాణ ఇపుడు ప్రజలు రెన్నెళ్లుగా జంక్ ఫుడ్ ప్రమాదకరమయిన అలవాటు కొన్నాళ్లయినా మాని చచ్చినట్లు వంట చేసుకుని సంప్రదాయిక ఆహారం తినాల్సి వస్తుంది.Quarantine Food గా ఇపుడు ట్రెండింగ్ అవుతున్నదంతా కూడా మన లోకల్ నుంచి ఇంటర్నేషన్ ఫుడ్ తయారుచేసుకోవడమెలా అనేదే.