హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేందుకు మొత్తానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ఆంధప్రదేశ్ అనుమతినించ్చింది.
ఆయనతోపాటు, టిడిపి ప్రధాన కార్యదర్శి నారాలోకేష్, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ లకు ఆంధ్ర వచ్చేందకు అనుమతిస్తూ ఈ పాస్ జారీచేశారు.
ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి.
ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ బాధితులను పరామర్శించేందుకు రేపు చంద్రబాబు విశాఖ వెళ్లాల్సి ఉంది. దీనికోసం ఆయన తెలంగాణ, ఆంధ్రప్రభుత్వాల అనుమతి కోరారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతించినా, ఆంధ్ర ప్రభుత్వం మాత్రం తాత్సారం చేస్తూ వచ్చింది. దీని మీద తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెప్పింది. ప్రభుత్వ దోరణిని తీవ్రంగా విమర్శించింది. ఫలితంగా రాత్రి ఈ పాప్ జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
https://trendingtelugunews.com/telugu/breaking/ap-government-declines-permision-for-chandrababu-naidu-to-visit-vizag-gas-leak-victims/
ఉదయం 10 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు బయలుదేరి, వెంకటాపురం గ్రామంలో ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీక్ మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు.
తాజా వార్త
విశాఖ నుండి రేపు ప్రారంభం కావాల్సిన విమానాల రాకపోకలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిసింది.
రేపు ఉదయం నుండి నాలుగు ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు డొమిస్టిక్ ఫ్లైట్ ల షెడ్యూల్ ప్రకటించారు. అయితే, ఆఖరి నిముషంలో సాంకేతిక కారణాలతో విమానాల రాకపోకలు రద్దు చేశారు. రేపు ఉదయం చంద్రబాబు రావాల్సిన ఫ్లైట్ కూడా రద్దయినట్టేనని తెలుస్తోంది చంద్రబాబు విశాఖ టూర్ పై మళ్ళీ సందిగ్ధం ఏర్పడింది.
రోడ్డు మార్గంలో అమరావతికి
టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో మార్పు జరిగింది. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో రేపు ఎటువంటి ఫ్లైట్స్ ల్యాండ్ అవడానికి లేదు అని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పిన నేపథ్యంలో బాబు పర్యటన షెడ్యూల్ మారింది. ఆయన హైద్రాబాద్ నుండి రోడ్డు మార్గంలో అమరావతికి వస్తారు.