చంద్రబాబు విశాఖ పర్యటనకు అనుమతినీయని ఆంధ్ర ప్రభుత్వం

ఇటీవల ఎల్జీ పాలిమర్స్ లో స్టైరీన్ విషవాయువు లీకయిన దుర్ఘటన లో దెబ్బతిన్న కుటుంబాలను పరామర్శించేందుకు ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినీయలేదు.
ఎల్ జి పాలిమర్స్ ప్రమాదంలో  12 మంది ప్రాణాలు కోల్సోయి అనేక వందల మంది అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. ప్రమాదంల నష్టపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబునాయుడు విశాఖ వెళ్లాలనుకున్నారు.
మే 23 వ తారీఖున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు  ఆయన విడివిడిగా లేఖలు రాసి హైదరాబాద్ వదలి వెళ్లేంందుకు , విశాక సందర్శించేందుకు అనుమతి కోరారు.
 దీనికి వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
ఈ విషయాన్నివిశాఖలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వెల్లడించారు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/telugu/breaking/ap-government-issues-to-epass-to-chandrababu-naidu-to-visit-vizag/

గ్యాస్ లీక్ ప్రమాదంలో దెబ్బతిన్న కుటుంబాలు   ఈ రోజుకు కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా  పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కూడా అనుకున్న రీతిలో స్పందించడం లేదు.
అందువల్ల  తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు  హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లాలనే ఉద్దేశంతో పర్మి షన్ కోరారు. అయితే, ఆయన విశాఖ పర్యటను ప్రభుత్వం అడ్డకుంటున్నదని, చంద్రబాబుపర్యటన గురించి వైసీపీ ప్రభుత్వానికి భయమెందుకు అని ఆయన ప్రశ్నించారు.
అయ్యన్న పాత్రుడు ఇంకా ఏమన్నారంటే…
 ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలను పరామర్శించడానికి ఒక ప్రతిపక్ష నేతకు పర్మిషన్ ఇవ్వరా? చంద్రబాబు నాయుడు అక్కడ ప్రజల్ని కలిస్తే మీ తప్పులు బయటపడుతాయని భయమా? కంపెనీవారికి, జగన్ కు ఉన్న చీకటి ఒప్పందాలు భయటపడుతాయనా? ప్రజల ప్రాణాలను బలిగొన్న ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకున్నాడో జగన్ చెప్పాలి.
జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యంలో హక్కులేదా? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.
ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నం వెళ్లి బాదితులను కాకుండా ఎయిర్ పోర్టులో కంపెనీ పెద్దలతో ఎందుకు చర్చలు జరిపారు.
 సంఘటన జరిగిన ప్రదేశానికి ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లలేదు? ముఖ్యమంత్రి భాదితుల దగ్గరకు వెళ్లడు, చంద్రబాబు నాయుడు వెళుతానంటే పర్మిషన్ ఇవ్వరు. ఇదెక్కడి న్యాయం. భాధపడుతున్న విశాఖ ప్రజల గురించి స్పందించిన రంగనాయకమ్మ లాంటి పెద్దమనిషి మీద కేసులు పెట్టి హింసించడం ఎంత వరకు న్యాయం.
పరిపాన బాగులేదంటే 4500 మందిపైన కేసులు పెట్టారు. డా. సుధాకర్ మాస్కులు ఇవ్వమని అడిగితే ఆయనపై దాడి చేసి, పిచ్చోడని ముద్రవేసి హింసిస్తున్నారు. జగన్ పాలనలో ఎక్కడ చూసినా దోపిడీ జరుగుతోంది. ప్రశాంతమైన విశాఖ నగరాన్ని ఏ2 సర్వనాశనం చేస్తున్నారు. వందల కోట్ల రూపాయాలను దండుకుంటున్నా అడిగే నాధుడు లేడు. ఆంధ్రుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామీ ఆస్తులను అమ్ముకుంటున్నారు. చివరకు లడ్డూలు కూడా స్వీటు షాపుల్లో అమ్ముకుంటున్నారు.