నిన్న విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ అంశంలో హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది.అక్కడ ఉన్న పోలీసులపై కేసులు నమోదు చేసి విచారణ చేయాలని సూచించింది.
ఆ ఆదేశాలు వెలువడిన కొన్ని నిముషాల వ్యవధిలోనే చంద్రబాబు పెంపుడు ఛానల్స్ లో ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అంటూ కధనాలు ఇచ్చాయి.
షాక్… చెంపపెట్టు అనేవి టిడిపి నేతలకు ఉంటాయి.నిజానికి చెంప చెళ్లుమనిపించింది కూడా వారికే.ప్రజలు అందుకే వారికి 23 సీట్లు ఇచ్చారు.
సుధాకర్ అనే వ్యక్తి దళితుడు ఆయనకు ఏదో జరుగుతోంది.అంటూ రకరకాల కూతలు కూస్తున్నవారికి చెబుతుందేమంటే సుధాకర్ విఐపి కాదు.ప్రజలకు మేలు చేసిన వ్యక్తి కాదు.
నిజానికి ఆ సంఘటనలో సుధాకర్ చేసిన వ్యవహారం వల్ల బలమైన సాక్ష్యాలు కనిపిస్తున్నాయి.అతను మాట్లాడిన వెర్షన్ చూస్తే…. ముఖ్యమంత్రిగారి గురించి మాట్లాడిన మాటలు చూస్తే నేను అతనిని డాక్టర్ అనుకోవడం లేదు పనికిమాలినవ్యక్తి మాట్లాడినట్లుగా బావిస్తున్నాను.
మాస్కులు లేవని మాట్లాడినప్పుడు డాక్టర్ లాగా కనిపించాడు.తర్వాత గుండు చేయించుకుని సైకోలాగా తయారై మాట్లాడిన తీరు చూస్తే ఎవరి డైరక్షన్ లో ఇదంతా నడిపారనేది తెలిసిపోతోంది.
టిడిపి నాయకులకు చెబుతున్నదేమంటే ….మీరు ఎన్ని రకాల కుయుక్తులు పన్నుతున్నారో,ఎన్నిరకాల వేషాలు వేస్తున్నారో, సుధాకర్ ను బలిచేయాలని చంద్రబాబు ఈ రకమైన డైరక్షన్ తీసుకున్నారో మాకు తెలియందేం కాదు.
పోనీ చంద్రబాబుగారికి ఇదేమైనా కొత్తా అంటే అదేమీ కాదు….చంద్రబాబు మొదటినుంచి కూడా దళితులను ఓటుబ్యాంకుగా చూడటం, మోసం చేయడం నేర్చుకున్నాడు.
అలాంటిది ఈ సంఘటన నేపధ్యంలో ఓ పదిమంది టిడిపిలోని దళిత నేతలు ఏం గుర్తుకువచ్చిందో కాని పరిగెత్తుకువచ్చి దళితుల ఆత్మగౌరవం దెబ్బతిందని మాట్లాడుతున్నారు.వారికి చెబుతున్నాను…ఒక్కసారి వెనకకు తిరిగిచూస్తే చంద్రబాబు ఏం మాట్లాడారో ఆయన మంత్రివర్గంలోని వారు ఏం మాట్లాడారో తెలుస్తుంది.
దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే ,దళితులు శుభ్రంగా ఉండరని ఆయన మంత్రివర్గంలోని ఆదినారాయణరెడ్డి అన్నారు.ఇవన్నీ మరచిపోయి ఇప్పుడు దళితుల ఆత్మగౌరవం దెబ్బతిందని అంటున్నారు.
ఈ 40 ఏళ్లలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఆయన ప్రజలకేం చేశారంటే చంద్రబాబే చెప్పలేని పరిస్ధితి .అలాంటి వ్యక్తి కోర్టులు చుట్టూ తిరుగుతూ మేనేజ్ చేసుకుంటూ…. హైకోర్టు మేనేజ్ చేస్తూ, లాయర్లను మేనేజ్ చేసుకుంటూ తిరుగుతూ దానిని చెంపపెట్టు అని మాట్లాడుతున్నాడు.
చంద్రబాబుగారి కేసులన్నీ చూస్తే 26 కేసులలో స్టేలు తెచ్చుకున్నారు.ఆయన జీవితం అంతా అదే.స్టేలు తెచ్చుకుని బతికే వ్యక్తి చంద్రబాబు.ఎంతసేపు మేనేజ్ చేస్తూ గట్టెక్కుదామని అనుకుంటుంటాడు.
అదేవిధంగా డాక్టర్ సుధాకర్.ఎవరైనా డాక్టర్ అయిఉంటే అతను దళితుడని ముఖాన రాసిఉండదు.
ఇటీవల నేను విజయవాడ బెంజిసర్కిల్ వద్ద వెళ్తుంటే పోలీసులు ఆపారు ఎవరు మీరంటే నేను పార్లమెంట్ సభ్యుడని చెబితే మాకు తెలియదని చెప్పారు.అంటే ఎంపీలకే ఈ పరిస్ధితి ఉంటే సుధాకర్ కు ఎక్కడో అన్యాయం జరిగిపోయింది.అతనిని దారుణంగా హింసించారు.చిత్రవధ చేశారంటున్నారు.
వాస్తవానికి పోలీసుల సహనం చూస్తే వారికి చేతులెత్తి దండం పెట్టాలి. సుధాకర్ శాడిస్ట్ లాగా బూతులు మాట్లాడి, కారుల కింద దూరి ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తికి వీరంతా సపోర్ట్ పలికి ఇతనినే అడ్డం పెట్టుకుని సంఘటనను పెద్దది చేసే కార్యక్రమం చేస్తున్నారు.
ఎంత దారుణం అంటే పేదలకు ఇళ్ళ ప్లాట్లు ఇచ్చే విషయంలో హైకోర్టుకు వెళ్తారు. స్టేలు తీసుకువస్తారు.ఇంగ్లీషు మీడియం చదువుకుని పేదవాడు బాగుపడతాడని జగన్ గారు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడదామంటే స్టేలు తెస్తారు.
ఈ వ్యక్తులను చూస్తుంటే వీరిని చూసి నవ్వాలో, బాధపడాలో అర్ధం కావడం లేదు.ఇందాక హైకోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే పదిమందివరకు వచ్చి ఛాన్స్ దొరికింది కదా అని మాట్లాడేస్తున్నారు.
మాక్కూడా మంచిదే సిబిఐ విచారణ జరగాలి.ఎవరేం చేశారో…అన్ని బయటకు వస్తాయి.మేం విచారణ జరిపి కేసు కడితే ఎలా ఉంటుందంటే, నిజంగానే వైయస్సార్ కాంగ్రెస్ చేసింది కాబట్టి ఇక్కడేదో అన్యాయం జరిగిందని చెప్పేఅవకాశం ఉంది.
వాస్తవానికి సిబిఐకి విచారణ ఇవ్వడం ఒక రకంగా మంచి విషయమే.అదేదో ప్రభుత్వానికి చెంపపెట్టని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
స్కూల్ బిల్డింగ్ లకు కలర్స్ వేసేవిషయంలో కూడా హైకోర్టుకు వెళ్లారు.చంద్రబాబు గమనించాల్సింది ఏమంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రభుత్వ ఆఫీసులకు ఎల్లోకలర్ వేస్తున్నారని పిటీషన్ హైకోర్టులో వేశారు.
అప్పుడు ఉమ్మడి హైకోర్టు ఏం చెప్పిందంటే సహజంగా ప్రభుత్వం ఉంది కదా వేసుకుంటే తప్పేముందని వ్యాఖ్యానించింది.నేడు మా పార్టీ కలర్స్ వేయడం లేదు.మట్టి రంగు మాదే, నీళ్ల రంగు మాదే, ఏ రంగు చూసినా మా పార్టీకే అంటగట్టే పరిస్ధితికి పడిపోయారు.
ఇదంతా చూస్తుంటే వారి వేదన తట్టుకోలేక రకరకాల కుయుక్తులు పన్నుతున్నట్లుగా ఉంది.ఈ రాష్ర్టాన్ని సర్వనాశనం చేయాలని చంద్రబాబు,టిడిపి నేతలు కంకణం కట్టుకున్నారు.రాష్ర్టాన్ని పక్కదారి పట్టించి ఏదో విధంగా పరిపాలన కుంటుపడేవిధంగా తీర్పులు తేవాలి.
చంద్రబాబూ…ప్రజలు మిమ్మల్ని ఎంత ఛీదరించుకున్నారో 23 సీట్లు ద్వారా తెలిసిపోయింది.ఈ సారి సింగిల్ డిజిట్ లభిస్తుంది.రెండో….మూడో మిగుల్తాయి డబల్ డిజిట్ వచ్చే పరిస్ధితి కూడా కనిపించడం లేదు.
డాక్టర్ సుధాకర్ విషయం నేను చెప్పడం కాదు.ఆయన మాట్లాడిన భాష….. మీడియాలో ఏం వచ్చిందో….. అందరూ వీడియోక్లిప్పింగ్స్ లో ఒకసారి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి.
ఇక్కడ అన్యాయం జరిగింది….డాక్టర్ సుధాకర్ కా….పోలీసులకా….లేక వైయస్సార్ కాంగ్రెస్ కా అనేది తెలుస్తుంది.
ముఖ్య మంత్రి గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు.అతను మాట్లాడిన భాష చూస్తే అతను డాక్టరో, పనికిమాలినవాడో మీరే చెబుతారు.
అతనికి కొత్తగా గుండుచేయించి సైకో గెటప్ వేసి అతనెవరో తెలియకుండా బిహేవ్ చేసి ,తన పక్షాన వచ్చిన వీడియోగ్రాఫర్స్ ద్వారా అవసరమైన మేరకు టిడిపి సోషల్ మీడియాలో పెట్టించి….అవసరం లేనివి కట్ చేయించారు.
సుధాకర్ వెర్షన్ చూస్తుంటే దళితులకు ఎక్కడో అన్యాయం జరిగిపోతుందంట.దళితులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడో ఇబ్బంది పెడుతోందంట.ఈ మాటలు మాట్లాడటానికి సిగ్గుపడాలి.
సుధాకర్ అనే వ్యక్తి ఒక సైకో. చూస్తుంటేనే అది అర్ధమవుతుంది.జగన్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి.సిఎంగారిని పట్టుకుని ఆ రకంగా ఇష్టానుసారంగా మాట్లాడమని ఎవరు డైరక్షన్ ఇచ్చి ఉండాలి.ఒక సామాన్యుడు అయితే ముఖ్యమంత్రిగారిపై ఈ స్దాయిలో విమర్శించే పరిస్ధితి ఉందంటే దానివెనక ఎవరి మధ్దతు ఉందే మీ అందరికి తెలియని విషయం కాదు.కుట్రకోణం దాగిఉందని చెబుతున్నాను.
అలాగే హైకోర్టు వచ్చే తీర్పు గురించి ముందే చంద్రబాబుకు తెలిస్తోందంటే ఖచ్చితంగా చంద్రబాబును విచారణ చేయాలి.ఆయన కాల్ లిస్ట్ బయటపెట్టాలి.ముందుగా వచ్చే తీర్పు కూడా ఈయనకెలా తెలుస్తుందనేది మాకు అర్ధం కాని పరిస్ధితి.
తీర్పు గురించి మాకైతే గంటన్నర తర్వాత తెలిసింది.అంత ఎలర్ట్ గా ఉండి దాని గురించి మీడియా సమావేశాలు పెట్టించడం,దానికి ముందే చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారంటే ఏ స్ధాయిలో మేనేజ్ చేస్తున్నారో అర్దం అవుతోంది.
చంద్రబాబు క్రిమినల్ ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారని రాష్ర్టప్రజలు అందరూ గమనిస్తున్నారు.చంద్రబాబూ….ఈ అల్లరి చిల్లర రాజకీయాలు చెల్లవు.ఎప్పుడో జరిగిపోయినవి చూసుకుని నేను ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్నావు.నీ అనుభవం మోసం చేయడానికి తప్ప మంచిపనికి ఉపయోగపడదు.నీ జీవితమంతా కష్టపడినా ఎన్నికలలో గెలిచే పరిస్ధితి లేదు.
నీవు ఎప్పటికైనా హైకోర్టు చుట్టూ తిరగాల్సిందే.ప్రజలు మా వైపే ఉన్నారు.ప్రజాక్షేత్రంలో గెలిచే దమ్ము నీకు లేదు.జీవితకాలం అంతా వ్యవస్ధను మేనేజ్ చేసుకుంటూ బతకాల్సిందే.నీలాంటి నాయకుడు ప్రతిపక్షనేతగా ఉండటం మాఖర్మ.ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు.
ప్రభుత్వవిధానాలలో లోపాలు ఉంటే చెప్పాల్సింది పోయి లేని,కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు.
నిన్న రంగనాయకమ్మగారిని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు.అంత పెద్దావిడ ను…. ఆవిడ ఎకౌంట్లను వాడుకుని వీళ్లు న్యూస్ లు పెట్టించారు.ఆ పరిస్ధితికి వీళ్లు వచ్చారంటే….. ఎంత బాధగా ఉందంటే కనీసం ఆ పెద్దావిడకు గౌరవం ఇవ్వాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు లేకుండా పోయింది.
రాజకీయంగా వాడుకునేందుకు చంద్రబాబు దళితులను,వృధ్దులను పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు.అలాంటి వ్యక్తి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు.నీ కుట్రలు, కుతంత్రాలు సాగనివ్వం.
హైద్రాబాద్ లో కూర్చుని సలహాలు ఇస్తున్నారు.ఆయనకున్న క్రిమినల్ ఆలోచనలమేరకు సలహాలు ఇస్తాడు.ప్రజలకు ఉపయోగపడేవి మాత్రం చెప్పడు.
సిబిఐ విచారణ వల్ల చంద్రబాబు అనుకున్నది జరగదనేది ఆయనకు కూడా తెలుసు.టిడిపి వాళ్లు సుధాకర్ ను ఏ విధంగా ఆడించారనేది మొత్తం బయటకు వస్తుంది.
రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అవసరాన్ని,జరిగిన అన్యాయాన్ని బట్టి ఉపయోగించుకోవాలి.చంద్రబాబుగారికి త్వరలో ఎదురుదెబ్బ తగలబోతోంది.చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది.
(బాపట్ల వైసిపి పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు)