ఒకరా ఇద్దరా ఏకంగా పదకొండుమంది అమెరికా దేశాధ్యక్షుల వంటా వార్పు పర్యవేక్షించిన వైట్ హౌస్ మాజీ బట్లర్ విల్సన్ రూజ్ వెల్ట్ జెర్మన్ కరోనా వైరస్ సోకి మరణించారు. ఆయన వయసు 91 సంవత్సరాలు.
ఈ పెద్దాయన మే 16 వ తేదీన మరణించారని ఆయన మనవరాలు శాంటా టేలర్ CNN కు చెప్పారు.
మొదట ఆయన మరణ వార్తను FOX 5DC రిపోర్టు చేసింది.
Tonight on @fox5dc at 10p –
He served at the pleasure of 11 U.S. Presidents… during his 55 years at the White House.
Last weekend, he passed from COVID-19.
My exclusive interview with the granddaughter of White House butler, Wilson Jerman is next! pic.twitter.com/SBiXbQLiud— ShawnYancy (@Fox5Shawn) May 20, 2020
ఆయన 1957క్లీనర్ గా వైట్ హౌస్ లో పనిచేయడం మొదలుపెట్టారు. అపుడు దేశాధ్యక్షుడు డ్వైట్ డి. ఐసెన్ హోవర్. తర్వాత ఆయన జాన్ ఎఫ్ కెన్నెడీ దేశాధ్యక్షుడిగా ఉన్నపుడు బట్లర్ గా ప్రమోట్ అయ్యారు. దీనికి కారణమ్ ఫస్ట్ లేడీ జాక్వెలిన్ కెన్నెడీ ఒనసిస్ అని చెబుతారు.
1997లో ఆయన వైట్ హౌస్ నుంచి రిటైరయ్యారు. అయితే, 2003లో బరాక్ ఒబామా అధ్యక్షుడయినపుడు మళ్లీ వైట్ హౌస్ కు వెళ్లారు. 2012లో ఆయన ఒబామా దేశాధ్యక్షుడి గా ఉన్నపుడు వైట్ హౌస్ ను వీడారు.
ఆయన కు 2011 స్ట్రోక్ వచ్చిందని మనవరాలు చెప్పారు. అపుడాయనకు వైద్యంఅందేలా ఒబామా శ్రద్ద తీసుకున్నారు. అంతేకాదు, అపుడపుడూ పుష్ఫగుచ్చాలు కూడా పంపే వారు. వైట్ హౌస్ కు 50
సంవత్సరాలు సేవలందించినందుకు ఒబామా ఆయన ఒక సన్మాన పత్రం బహూకరించారు. దానితో పాటే పలువురు దేశాధ్యక్షల దగ్గిర పనిచేసినందుకు గుర్తుగా ఒక నాణెం కూడా అందించారు.
” తన అభిమానం సేవలతో దేశాధ్యక్షుల కుటుంబాలకు వైట్ హౌస్ సొంత ఇల్లులాగా మార్చాడని,’ ఫస్ట్ లేడీ మిసెల్ ఒబామా సిఎన్ ఎన్ కు చెప్పారు.
హిల్లరీ క్లింటన్, అమెరికా ఒక నాటి అధ్యక్షుడు జార్జిబుష్ కూతురు జెన్నాబుష్ హేగర్ కు ఆయన నివాళులర్పించారు.
Bill and I were saddened to hear of the passing of Wilson Roosevelt Jerman at the age of 91 from COVID-19. Jerman served as a White House butler across 11 presidencies and made generations of first families feel at home, including ours. Our warmest condolences to his loved ones.
— Hillary Clinton (@HillaryClinton) May 21, 2020