మే 23న వైసిపి జెండా పండగ, ఆ రోజే ఎందుకో తెలుసా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్బంగా ఈ నె 23వ తేదీన నియోజకవర్గ హెడ్ క్వార్టర్‌తో పాటు మండల కేంద్రాల్లో పార్టీ జెండాలు ఎగరేయాలని,  పేదలకు పండ్ల పంపిణీతో పాటు సేవా కార్యక్రమాలు  చేపట్టాలని వై.య‌స్‌.ఆర్‌. కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది.
గత ఏడాది మే 23న ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. తొలినుంచి పార్టీకి అధిక్యత మొదలయింది. రాత్రికల్లా అది అఖండ విజయం వైపు దారి తీసింది. అందువల్ల ఈ తేదీన వైఎస్ ఆర్ కాంగ్రెస్ చరిత్రలో ఒక మైలురాయి అయింది. దీనికి గుర్తింపు పార్టీ వార్షికోత్సవ సంబరాలు ఆరోజు నుంచి మొదలుపెడుతున్నారు.

https://trendingtelugunews.com/telugu/breaking/cab-aggregator-ola-to-fire-1400-employess-revenue-down-by-95-percent/

ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పార్టీ నేతలకు ఒక లేఖ రాశారు. అయితే, ఈ వార్షికోత్సవ సంబరాలు కరోనా లాక్ డౌన్ నియమాలకు లోబడి ఉండేలా చూడాలని ఆయన హెచ్చరించారు.
‘వైసిపి భారీ మెజార్టీతో గెలుపొంది ఈనెల 23 నాటికి సరిగ్గా ఏడాది. ప్రజల ఆశలు- ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా ప్రియతమ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు సమూలమైన మార్పులు తెచ్చారు. తొలి సంవత్సరంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో 90శాతం నెరవేర్చి, ప్రకటించని 40 కొత్త పధకాలు అమలు పరుస్తూ, దేశంలోనే అత్యుత్తమ సీఎంగా, మంచి మనసున్న ముఖ్యమంత్రిగా మన్ననలు పొందా‘రని ఆయన లేఖలో పేర్కొన్నారు.
 దీనిని దృష్టిలో పెట్టుకుని  నియోజకవర్గాల్లో ప్రభుత్వ పధకాల ద్వారా లబ్దిపొందిన వారి డేటాను సేకరించాలని, వాటితో పాటు  నియోజకవర్గాల్లో  నేతలు సొంతంగా సాధించిన ప్రగతిపై కరపత్రాలు, వీడియోలు, ప్రకటనల రూపంలో పంచాలని ఆయన చెప్పారు.
‘మన పార్టీకి గెలుపు అందించిన 23వ తేదీ నుంచి మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 30 వరకు ప్రచారం నిర్వహించాలి,’ అని పార్టీ నేతలను కోరారు.
ఏడాది పాలన, ప్రగతి పధకాలపై ఇప్పటికే ప్రభుత్వం వారం రోజుల (23 నుంచి 30 వరకు) కార్యకలాపాలకు రూపకల్పన చేసింది. దానికి అనుగుణంగా మీరు కార్యక్రమాలు నిర్వహించాలి.

 Like this story? Please Share it to a friend!