తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాలు ఎపుడు మొదలవుతాయో టిటిడి చెప్పలేకపోతున్నది. అయితే, భక్తులందరికి శ్రీవారి లడ్డులను అందుబాటులో ఉంచాలని టిడటి నిర్ణయించింది. దీనికితో డు చిన్న లడ్డూలను 50 నుంచి 25రూపాయలకు తగ్గించాలని దేవస్థానం నిర్ణయిచింది. ఈ విషయాలను తిరుమల టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రకటించారు. అదేవిధంగా భక్తులకు కోరినన్ని లడ్డులు విక్రయిస్తారు. ఎల్లుండి నుంచి ఇాది మొదలవుతుంది.
అదేవిధంగా ఎపిలోని టిటిడి కళ్యాణ మండపాల్లో భక్తులకు లడ్డులు అందుబాటులో ఉంటాయని, శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభమయ్యేంత వరకు భక్తులకు ఈ ఏర్పాటు కొనసాగుతుందని సుబ్బారెడ్డి చెప్పారు.
కాకపోతే శ్రీవారి ఈ-హుండీ ద్వారా కానుకలు సమర్పించే భక్తులకు ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పారు.
ఈ-హుండీ ఆదాయం 2019 సంవత్సరంలో 1.79 కోట్లు 2020 సంవత్సరంలో 1.97కోట్లు ఆదాయం వచ్చిందని ఆయన చెప్పారు.
భక్తులకు దర్శనం కల్పించలేకపోయినా ఈ-హుండీ ద్వారా భక్తులు కానుకలు సమర్పించుకున్నారని, ప్రతిరోజు 3నుంచి 4లక్షల లడ్డూలను తయారుచేస్తున్నామని ఆయన చెప్పారు.
అధిక లడ్డూలు కావాల్సిన వారు తిరుమల ఆలయ డిప్యూటీ ఇఓ 9849575952, పోటు పేష్కార్ 9701092777 సంప్రదించవచ్చునని ఆయన చెప్పారు.
శ్రీవారి దర్శనం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడే చెప్పలేమని కూడా ఆయన వెల్లడించారు.
తిరుపతి కోవిడ్-19 ఆసుపత్రికి అవసరమైన మౌళిక వసతులకు టిటిడి పూర్తి సహకారం అందిస్తుందని సుబ్బారెడ్డి చెప్పారు.