‘వందే భారత్ మిషన్’ కింద విదేశాల్లో కోవిడ్ 19 వ్యాప్తి వల్ల ఇండియా రావాలనుకుంటున్నవారిని ఇండియా రప్పిస్తున్నారు. వారిని స్వస్థలాలకు తరలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది.
ఇందులో భాగంగా 143 మంది ప్రవాసాంధ్రులు లండన్ నుంచి ఎయిరిండియా విమానంలో బుధవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
వీరికి విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం క్వారంటైన్ కేంద్రాలకు పంపనున్నారు.
ఆర్టీసీ బస్సుల ద్వారా ఏ జిల్లాకు చెందిన వారిని ఆ జిల్లాలకు తరలిస్తున్నారు. వీరి కోసం ప్రభుత్వ, నగదు చెల్లింపు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల ఆసక్తిని బట్టి ప్రభుత్వ, నగదు చెల్లింపు క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తామని అధికారులు తెలిపారు..