లాక్ డౌన్ లో ప్రదర్శనలు, ధర్నాలు చేసేందుకు వీల్లేదు. జనం ఎక్కడా గుంపుకాకూడదు. దీనిని అదును చేసుకుని, ప్రజలనుంచి ఎలాంటి వ్యతిరేకత రాదనే ధైర్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగ దారుల మీద తీవ్రమయిన భారం మోపింది.
విద్యుత్ వినియోగం శ్లాబులను మారుస్తున్నట్లు మాటవరసకు కూడ ప్రకటించలేదు. సూచన కూడా ఇవ్వలేదు. నేరుగా శ్లాబులు మార్చి బిల్లు ఏకంగా ఇళ్లకు పంపిచారు. కోరనో వాల్ల కార్యాలయాలుకూడా పనిచేయడం లేదుకాబట్టి ఎవరూ ఆఫీసులకు వచ్చి ఫిర్యాదు చేయడం లేదు ఎందుకు పెంచారని విచారణ చేయడం కూడాసాధ్యం కాదని ప్రభుత్వం భావించినట్లులుంది. అయితే,విద్యుత్ బిల్లు భారం కారణంలో నెల్లూరు పట్టణలో కొంతమంది ఏదో ఒక రూపంలో తన నిరసన తెలపాలనుకున్నారు, కరోనా వాక్ డౌన్ నియమాలకు లోబడే వారు నిరసన తెలిపారు.
పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే రద్దు చేయాలని Apuwj రాష్ట్ర కార్యదర్శి గౌతమ బుద్ధుడు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. జయప్రకాశ్ ప్రధాన కార్యదర్శి ఆరువ రాయప్ప ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .
బుధవారం నెల్లూరు స్వతంత్ర పార్కులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచటం ప్రజలకు తీవ్ర కష్టనష్టాలకు గురి చేస్తుందన్నారు.
.లాక్డౌన్ వల్ల ప్రజలు జీవనోపాధి లేక అష్టకష్టాలు పడుతుంటే కరెంటు బిల్లులు పెంచడం భావ్యం కాదన్నారు .ఒక సినిమా థియేటర్ నడవ కున్న లక్షల రూపాయల బిల్లు రావటం విచిత్రంగా ఉందన్నారు .స్వయం ఉపాధి చిన్నతరహా కుటీర పరిశ్రమలకు చిన్న వ్యాపార సంస్థలకు సర్వీస్ సెంటర్లకు మినిమం విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు .
వినియోగ చార్జీల పేరిట రూపాయలు 55.అదనంగా వసూలు చేయటం అరవై రోజులకు రీడింగ్ తీయడం వల్ల శ్లాబులు మారిపోయి వేల రూపాయల్లో బిల్లులు వచ్చాయన్నారు.
ఫిబ్రవరి బిల్లు ప్రకారం మార్చి నెలలో చెల్లించిన పరిగణలోకి తీసుకోకుండా ఏప్రిల్ బిల్లులో వేయడం దారుణమన్నారు .300యూనిట్ల లోపు వినియోగదారులకు గతంలో యూనిట్‌కు 3.60 రూపాయలు ఉంటే ఇప్పుడు ఏకంగా 5.40 రూపాయలు పెంచడం దారుణమన్నారు కొత్త టారిఫ్ అమలు చేయకుండా పాత టారిఫ్ మీదనే విద్యుత్ చార్జీలు సెప్టెంబర్ తర్వాత వసూలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .విలేకర్ల సమావేశంలో మాజీ కార్పొరేటర్ పిట్టి సత్యనారాయణ . బండి ప్రసాద్ అరవ రామమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.