లాక్ డౌన్ తో బిజినెస్ కుదేలయిందని, అందువల్ల 1400 మంది ఉద్యోగులనుతొలగించాల్సి వస్తున్నదని క్యాబ్ సర్వీసులు నడిపే ఓలా (Ola) ప్రకటించింది. గత రెన్నెళ్ల లో కరోనా వైరసర్ లాక్ డౌన్ వల్ల ఓలా ఆదాయం 95 శాతం పడిపోయిందని చెబుతూ ఉద్యోగాల కోత అనివార్యమవుతూ ఉందని కంపెనీ సిఇవొ భవేష్ అగ్గర్ వాల్ ప్రకటించారు. రెన్నెళ్ల లో బిజినెస్ లేకపోవడమే కాదు, ముందుముందు కూడా పరిస్థితి అస్పష్టంగా, అగమ్య గోచరంగా ఉందని ఆయన చెప్పారు. కరోనా లాక్ డౌన్ ప్రభావాం తమ కంపెనీ మీదచాలా కాలం ఉండేలా ఉందని ఆయన ఉద్యోగలకు పంపిన ఒక ఇమెయిల్ పేర్కొన్నారు.
కరోనా నియంత్రణ జరిగినా మళ్లీ మునుపటి రోజులు రావాలని ఓలా యాజమాన్యం భావిస్తూ ఉంది.
వైరస్ దుష్ప్రభావం ప్రత్యేకంగా మన పరిశ్రమ చాలా తీవ్రంగా ఉంది. మన ఆదాయం గత రెన్నెళ్లలో 95 శాతం పడిపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ సంక్షోభం మనతో పనిచేసి లక్షలాదిమంది డ్రైవర్ల,వాటి కుటుంబాల జీవితాలను మీద బాగా దెబ్బతీసింది. అదే విధంగా మనఅంతర్జాతీయ కార్యకలాపాలను కూడా ప్రభావితం చేసింది,’ అని ఇమెయిల్ లొపేర్కొన్నారు.
“…the impact of this crisis is definitely going to be long-drawn for us. The world is not going to revert to the pre-COVID era anytime soon. Social distancing, anxiety and an abundance of caution will be operating principles for everyone,” అని ఆయన చెప్పారు.
ఉద్యోగాల మీద కోత విధించడమనేది ఒకే దఫా చేస్తామని, ఇండియా మొబిలిటి బిజినెస్ లో ఈ వారాంతానికి ఈ పని పూర్తవుతుందని, ఓలా పుడ్స్, ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మరొక వారం కొనసాగుతుందని చెబుతూ భవిష్యత్తు లో మళ్లీ కరోనా ఉద్యోగాల కోత ఉండని అగ్గర్వాల్ హామీ ఇచ్చారు.
చాలా మంది ఉద్యోగులను కంపెనీలు ఇళ్ల దగ్గిర నుంచే పనిచేయమని చెబుతూ ఉండటం, ఎంతో అవసరమయితే తప్ప విమానా ప్రయాణలు చేయవద్దని చాలా మంది నిర్ణయించుకోవడం, విహార యాత్రలను రాబోయే మంచిరోజులనాటికి వాయిదావేసుకోవడం ఈ ఓలాలో ఉద్యోగాల కోత అనివార్యమయిందని ఆయన చెప్పారు.