రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసి బస్సులు నడువనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురు వారం నుంచి 1683 బస్ లను నడువుతున్నామని ఎపిఎస్ ఆర్టీసి ప్రకటించింది. అయితే, బస్ చార్జీలను పెంచడం లేదు.
ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి బస్ టికెట్స్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చునని, రేపు ఉదయం 7 గంటల నుంచి బస్ సర్వీసులు ప్రారంభం అవుతాయని ఆర్టీసి ప్రకటించింది.
తరువాత డిమాండ్ ను బట్టి బస్ సర్వీసులను పెంచుతామని అధికారులు తెలిపారు.
ఇక అంతర్రాష్ట్ర సర్వీసులకు సంబంధించి, ఇతర రాష్ట్రాలకు బస్ లను నడిపేందుకు ఆయా రాష్ట్రల అనుమతి కోసం దరఖాస్తు పంపామని అనుమతి రాగానే ఇతర రాష్ట్రాల సర్వీసులు నడుపుతామని అధికారులు చెప్పారు.
ఏసీ బస్ లను నడిపే ఆలోచన ఉందని, ఒకవేళ నడిపితే ఏసీ 26 పాయింట్స్ మాత్రమే ఉంటుందని అధికారులు చెప్పారు.
కడప జిల్లాలో 182 బస్సులు రోడ్లపైకి
గురువారం నుంచి కడప జిల్లాలోని 8 డిపోాలనుంచి 182 బస్సులను నడిపాలని నిర్ణయించారు. అందులో కడప నుంచి 32, పులివెందుల 22, రాజంపేట 20, రాయచోటి 30, బద్వేలు 16, మైదుకూరు 17, పొద్దుటూరు 30, జమ్మలమడుగు 15 బస్సులను నడుపుతారు. కడప నుంచి తిరుపతి 8, కడప నుంచి మదనపల్లి కి రెండు, కడప నుంచి అనంతపురం రెండు, కడప నుంచి నెల్లూరు కి రెండు, కడప నుంచి కర్నూలుకు 4 బస్సులను నడిపుతారు.
ఎక్కడ నుంచి బస్సు బయలు దేరుతుందో అక్కడే టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదా ఆన్లైన్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. బస్సులో టికెట్లు ఇవ్వడం జరగదని అధికారులు తెలిపారు.
మొత్తం 182 బస్సులకు 797 సింగిల్స్ తిరిగుతాయి. ఉదయం 7 గంటల నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. రాత్రి 7 గంటల లోపు బయలుదేరిన బస్సు తిరిగి గమ్యస్థానాన్ని చేరుకుంటాయి.