కోవిడ్ కు విరుగుడు ఎపుడెపుడు వస్తుందా ఆత్రంగా ఎదురుచూస్తున్నవాళ్లందరికి గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ క్యాలిఫోర్నియా లోని లా జోలా ఇన్ స్టిట్యూట్ ఫర్ ఇమ్యునాలజీ ( La Jolla Institute for Immunology) నుంచి వస్తున్నది. గుడ్ న్యూస్ ఏంటంటే…ఒకసారి కరోనా వైరస్ సోకి జబ్బు నయమయిన వారిలో కోవిడ్ -19 యాంటి వైరల్ ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ తయారవుతుంది. అంటే మరొక సారి కోవిడ్ రావడం చాలా కష్టం.
దీనితో కరోనా వ్యాక్సిన్ తయారు చేసేవాళ్లంతా మరింత ఉత్సాహంగా పనిచేయవచ్చు. ఈ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను ప్రఖ్యాత శాస్త్ర పరిశోధన జర్నల్ సెల్ (Cell)లో ప్రచురించారు.
“కోవిడ్ -19 నుంచి కోలుకున్న వారిలో ఏదో ఒక స్థాయిలో ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటే మేము ఆందోళనచెందేవాళ్లం, అదిఆందోళన కలిగించే విషయం,’ అని ఈ ఇన్స స్టి ట్యూట్ కు చెందిన సెంటర్ ఫర్ ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ అండ్ వ్యాక్సిన్ రీసెర్చ్ (Center for Infectious Diseases and Vaccine Research)కు చెందిన ప్రొఫెసర్ అలెజాండ్రో సెట్టె తెలిపారు.ఆయనే ఈ రీసెర్చ్ పేపర్ ను రాసింది కూడా. ‘ ఇలా కోవిడ్ నయమయిన వారిలో కరోనావైరస్ స్పైక్ ప్రొటిన్ కుశరీరంలో రోగనిరోధక టి సెల్ స్పందన చాలా బలంగా తయారయింది. ఇపుడు కోవిడ్ -19 కు వ్యతిరేకంగా సాగుతున్న పరిశోధన లక్ష్యం కూడా ఇదే,’ అనిఆయన చెప్పారు.
(“ … but what we see is a very robust T cell response against the spike protein, which is the target of the most ongoing COVID-19 efforts as well as other viral pro other proteins.”)
పరిశోధన కోసం సెట్ బృందం 20 మందిని ఎంపిక చేసుకుంది. వీరంతా కోవిడ్ 19 నుంచి కోలుకున్నవారు. కోవిడ్ అంటుకున్నాక, రోగుల రోగ నిరోధక శక్తి ఎలా పనిచేస్తుందనేది, శరీరంలో వైరస్ కు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తి ఏమేరకు అభివృద్ధి అయిందనే దాన్నిఅర్థం చేసుకునేందుకు ఇదిబాగా పనికొచ్చింది. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ రూపొందించేందుకు ఈ విజ్ఞానం చాలా అవసరం.
కరోనా మనిషి శీరర కణజాలం లో చొచ్చుకుపోయేందుకు వైరస్ కు పొడవాటి కొమ్ముల పాత్ర చాలా ఉంటుంది. అందువల్ల ప్రపంచంలోని శాస్త్రవేత్తలో దృష్టంతా ఈ కొమ్ముల ప్రొటీన్ (spike protein) పడింది. దీనిని నిర్వర్యం చేస్తే కరోనా వైరస్ శరీరకణాల్లోకి ప్రవేశించలేదు. కరోనా మనిషి శరీక కణజాలంలోకి ప్రవేశించాలంటే ఈ కొమ్ములతో కణం మీద వాలుతుంది. అపుడు ఈ స్పైక్ ప్రొటీన్ మనిషి కణంలోని రక్షణపొరకు అతుక్కుంటుంది. అపుడు ఈ రెండు రెండు పొరలు కలసి పోయి, వైరస్- శరీర కణంలో ఒకటై పోతుంది. అపుడు వైరస్ లోని జన్యు పదార్థం కణంలోకి ప్రవేశిస్తుంది.
Like this story? Please share it to a friend!