తెలంగాణ లో జూన్ 8 నుండి టెన్త్ పరీక్షలు నిర్వహించుకునేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ విషయం మీద ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది.
టెన్త్ పరీక్షలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హైకోర్టు కు ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. ప్రభుత్వం ధాఖలు చేసిన అఫిడవిట్ పై హైకోర్టు విచారణ జరిపింది.
పరీక్ష కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు.
జూన్ 3 న మరొక కోవిడ్ పరిస్థితులను సమీక్షించి జూన్ 4 న కోవిడ్ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు అదేశించింది.
జూన్ 8 న పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. అయితే, ప్రతి పరీక్ష కు రెండు రోజుల వ్యవధి ఉండాలని, పటెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది.
అన్ని చర్యలు చేపడుతామని ప్రభుత్వం సానుకూలం వ్యక్తం చేసింది.
కోర్టు ఉత్తర్వలు నేపథ్యంలో టెన్త్ పరీక్షల కోసం కొత్త షెడ్యూల్ ప్రకటించబోతున్నారు. రేపు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారలు సమావేశమై కొత్త షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. కరోెా లాక్డౌన్ కారణంగా టెన్త్ పరీక్షలు నిలిపివేయాలని కోర్టులో వేసిన పిల్ మీద ఈ రోజు కోర్టు విచారించింది. మే 31కి లాక్ డౌన్ ఎత్తి వేస్తున్నందున, జూన్ 3 న ఒక సారి కరోనా పరిస్థితి సమీక్షించి పరీక్షలు నిర్వహించాలని కోర్టు చెప్పింది. జూన్ రెండో వారంలో పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంది.