తెలంగాణ కరోనా పరీక్షల మీద కేంద్రం అసంతృప్తి

తెలంగాణలో కరోనాలేదని చెప్పేందుకు పరీక్షలను నిలిపివేశారా, ఆ మధ్య  ఈ టాక్ వినిపించింది. అయితే, ఎవరూ దీనిని అంతీ సీరియస్ గా తీసుకోలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాట తీరు, అధారిటేటివ్ ఆయన చెప్పే విషయాలు  విన్నవారికి  తెలంగాణలో కరోనా కంట్రోల్ లోకి వచ్చిందేమో అనిపిస్తుంది. ఆయన మాటల్ని శంకిస్తేమనలోనే ఏదో లోపముందేమో అనుమానం వచ్చేంత గొప్పగా ఆయన ఏవిషయాన్నయినా చెప్పి నమ్మిస్తారు. ఇదే కరోనా విషయంలో కూడా జరిగిందా?
ఎవరికి అనుమానం వచ్చినా రాకపోయినా,  కేంద్రానికి తెలంగాణ  కరోనా పరీక్షల మీద అనుమానం వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని (Proactive)గా పరీక్షలు నిర్వహించడంలేని, ఇలాంటి ధోరణి  కోవిడ్ -19 మహమ్మారిని అణచేసేందుకు సహకరించదని కేంద్రం వ్యాఖ్యానించింది.
వైరస్ ని మనం వెంటబడి తరమాలి తప్ప, అది మనని వెంబడించకూడాదు (We need to chase the virus rather than the virus chase us) అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్ ఎపుడో మే 7వ తేదీనే తెలంగాణ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాశారు.
రాష్ట్రంలో పాజిటివ్ కేసులు చాలా ఉన్నాయని, అయితే, అక్కడ టెస్టులు చాలా తక్కువగా జరుగుతున్నాయని కూడా ప్రీతిసూడాన్ లేఖ లో పేర్కొన్నారు.
దేశమంతా జరిగిన పరీక్షలలో తెలంగాణలో జరిగింది కేవలం 1.5 శాతం పరీక్షలే.దేశంలో 14లక్షల RT-PCR (Real Time-Polymerase Chain Reaction) పరీక్షలు జరిగితే తెలంగాణలో జరిగింది కేవలం 20,754 పరీక్షలేనని ఆమె లేఖ లో పేర్కొన్నారు.
ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడుల కంటే బాగా వెనకబడి ఉందని ఆమె లేఖలో రాశారు. ఈ రాష్ట్రాలలో కోవిడ్ -19 కేసులు బాగా ఎక్కువగా కనిపిస్తున్నందుకు కారణం ఇక్కడ పరీక్షలు బాగా జరగడమే. అంటే పరోక్షంగా పరీక్షలు జరపకుండా కేసుల్లేనట్లు తెలంగాణ చెబుతున్నదనేగా అర్థం.
ఈ విషయం మీద ది ప్రింట్  తెలంగాణ చీఫ్ సెక్రటెరీ సోమేష్ కుమార్ ను ఫోన్ లో కాంటాక్ట్ చేసింది. ఆయనేమంటారో తెలుసుకోవాలనుకుంది. ఆయన ఫోన్ కాల్ కు గాని, మెసేజ్ కు గాని స్పందించలేదని ది ప్రింట్  రాసింది.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ మాత్రం ఆదివారం తక్కువ పరీక్షలు జరుపుతున్న విషయాన్ని ఖండించారు.
ఆయన తన స్పందనను “ The number of tests…is lower means the test are done for the people for whom indication is there strictly as per the ICMR (Indian Council of Medical research) guidelines”. అని  ట్వీట్ చేశారు. ఎక్కువ పాజిటివ్ కేసులు కనిపించేందుకు కారణం కాంటాక్ట్ లను కనిపెట్టడంలో తెలంగాణ చక్కగా పనిచేయడమేనని ఆయన వాదించారు.

 

ఇతర రాష్ట్రాలతోనే కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ తో పోల్చినా తెలంగాణ కరోనా టెస్టుల విషయంలో చాలా వెనకబడింది.
ఆంధ్రప్రదేశ్ రోజూ సుమారు 9వేల పరీక్షలు నిర్వహిస్తూంటే తెలంగాణలో ఇవి రెండు 200 మించడం లేదని ప్రింట్ రాసింది. తెలంగాణలో కరోనా పరీక్షల రేటే ఏప్రిల్ 3- మే 6 మధ్య జాతీయ సగటు కంటే బాగా తక్కువగా ఉన్న విషయాన్ని ప్రీతిసూడన్ లేఖ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కాలానికి ఆల్ ఇండియా సగటు ప్రతిపదిలక్షల జనాభాకు 1.025 ఉంటే తెలంగాణలో కేవలం 546 మాత్రమే అని పేర్కొన్నారు.
“Further, at all-Inda level, percentage of positive samples to total tesgts( positivity rate) is about 4.12 percent where as in Telangana, it is 5.26 percent, which showntht if we carry out RT-PCR testing aggressively, we will be able to indentify cases and be able to have better containment by breaking the chain,” అని సూడాన్ చెప్పారు.
పాజిటివ్ కేసుల రేటులో కూడా తెలంగాణ జాతీయ సగటుకంటే బాగా తక్కువ గా ఉంది. దీనిని పాజిటివిటి రేటు అంటారు. అంటే మెత్తం పరీక్షలలో పాజిటివ్ కేసులు ఎన్నున్నాయన్నదే పాజిటివిటి రేటు. జాతీయ స్థాయిలో ఇది 4.12 శాతం ఉంటే తెలంగాణలో 5.26 శాతం ఉంది. అందువల్ల ఎక్కవ పరీక్షలు చేస్తే ఎక్కువ కేసులను గుర్తించవచ్చు అపుడు కరోనా వ్యాపించే చైన్ ను తెంచేసి వైరస్ కంట్రోల్ చేయడం సులువవుతంది అని ప్రీతిసూడాన్ లేఖ లోపేర్కొన్నారు.
ఐసిఎం ఆర్ అమోదించిన ల్యాబ్ తెలంగాణలో 20  ఉన్నాయి. ఇందులో 9 ప్రభుత్వానివయితే, 11 ప్రయివేటువి. అయితే, తెలంగాణలో ఎందుకోగాని ప్రయివేట ల్యాబ్ లను పరీక్షలకోసం వాడడటం లేదని ప్రీతిసూడన్ లేఖలోపేర్కొన్నారు. అంటే తెలంగాణలో ల్యాబొరేటరీ కెపాసిటీని కూడా పూర్తిగా వాడుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.