ఆంధ్రప్రదేశ్ లో మద్యం వినియోగాన్ని బాగా తగ్గించే కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ కార్యకమ్రం జోరుగా సాగుతూ ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.
క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం వెల్లడించారు.
రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు తగ్గించేందుకు తీసుకున్న చర్య ల గురించి ఆయన వివరించారు.
ఆయన ఏం చెప్పారంటే...
అధికారంలోకి వచ్చిన వెంటనే లిక్కర్ రేట్లు పెంచాం . మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాం. బెల్టుషాపులు ఎత్తివేశాం పర్మిట్ రూంల ఎత్తివేశాం. మద్యం అమ్మే వేళలు కూడా తగ్గించాం. ఇంకా రేట్లు పెంచాం, బాగా దుకాణాలు తగ్గించాం, బాగా వినియోగాన్ని తగ్గించాం. లిక్కర్ అండ్ శాండ్ నియంత్రణ మీద కూడా కొందరు యువ ఐపీఎస్‌లను పెట్టాం.నిజాయితీ కూడిన వ్యవస్థగా వారంతా పనిచేయాలి. ఎవరున్నా కూడా ఉపేక్షించాల్సిన పనిలేదు. దీన్ని ఎలా డీల్ చేస్తామన్న విషయంమీద రాష్ట్రమే కాదు, దేశమంతా కూడా మనవైపు చూస్తున్నాది.
మద్య నియంత్రణ కోసం చాలా చర్యలు తీసుకున్నాం. పక్కరాష్ట్రాల్లో మద్యాన్ని ఎలా తాగించాలన్న ఆలోచన చేస్తున్నారు. మనం మద్యాన్ని ఎలా తగ్గించాలని ఆలోచన చేస్తున్నాం.: అని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.