రేపు ఉదయం నుంచి హైదరాబాద్ బయట ఆర్టీసి బస్సులు తిరుగున్నాయి. బస్సులను కరోనా ప్రొటొకోల్ ప్రకారం నడిపిస్తారు. బస్సులలో సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. అందువల్ల సీట్లను మారుస్తున్నారు. ఒక వరుసలో ఒకటి, రెండో వరసలోరెండు సీట్లు దూరదూరంగా ఉంటాయి. బస్సులు హైదరాబాద్ కు వస్తాయిగాని జూబ్లీ బస్ స్టేషన్ కు మాత్రమే వెళతాయి.ఇమ్లీబన్ బస్స్టాండ్, కు రావు.అదే విధంగా దిల్ షుక్ నగర్ వైపు కూడా రావు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
బస్సులు సాయంత్రం ఏడు దాకా నడుస్తాయని చెబుతూ ఏకారణం చేతనయినా ఆలస్యమమయితే మరొకగంట సేపు అనుమతిస్తారని కూడా ఆయన చెప్పారు. రాత్రి పూట బస్సులు తిరగవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.