కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నియమాలను సడలించిన నేపథ్యంలో బస్సులను నడిపేందుకు ఆర్టీసి రెడీగా ఉందని .ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన 24 గంటల్లో సర్వీసులు ప్రారంభించడానికి సిధ్దంగా ఉన్నామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖల మంత్రి పేర్నినాని వెల్లడించారు. ప్రెస్ మీట్ కామెంట్స్….
‘కేంద్రం ఇచ్చిన నిబంధనలను, రాష్ట్రంలో ఉన్న పరిస్ధితులను రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఏది రిలాక్స్ చేయకూడదు, ఏది చేయవచ్చు అని స్టేట్ లెవల్ టాస్క్ ఫోర్స్ సూచనలు మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఆయన నిర్ణయం వచ్చేవరకు వేచిచూడాల్సిందే,’ అని ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
ఈ టిక్కెటింగ్, క్యాష్ లెస్ ట్రావెల్ అనేది ఆలోచన ఉంది తప్ప అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఏదైనా సరే ముఖ్యమంత్రి స్దాయిలో పాలసీ డెసిసన్స్ తీసుకోవాల్సి వస్తుంది..
బస్సులు నడిపేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది స్టేట్ టాస్క్ ఫోర్స్ మనకు సూచనలు ఇస్తుంది. ఆ ప్రకారం అంటే బస్సు ఎలా నడపాలి,సీట్లు ఎలా ఉండాలి,ప్రయాణికులను ఎలా కూర్చోబెట్టాలి,సీట్లు ఎలా బ్లాక్ చేసుకోవాలి,రిజర్వేషన్లు ఎలా అనేది అన్ని ఉంటాయి.కోవిడ్ నేపధ్యంలో స్టేట్ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన సూచనలనే ఆర్టిసి ఖచ్చితంగా అమలు చేస్తుంది.
అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ విషయంలో వివరణ, రవాణా మంత్రిగా నేను చెప్పిన మాటలకు భిన్నంగా మాట్లాడినట్లు ఒక్క ఆర్డర్ ఉన్నాఅది చూపించండి.ఆ అధికారి,నేను క్షమాపణ చెబుతాను
రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి కృష్ణబాబు కామెంట్స్
హెల్త్ ఇన్సూరెన్స్,కోవిడ్ ఇన్సూరెన్స్ గాని అవుట్ సోర్సింగ్ వారికి లేదు కాబట్టి కోవిడ్ నేపధ్యంలో వారిని ఎక్స్ పోజ్ చేయకుండా మిగిలినవారితో ఉన్నపనులు చేయండి అనేది ఆర్టీసి జారీ చేసిన సర్క్యులర్ ఉద్దేశ్యం.
మంత్రిగారు చాలా క్లియర్ గా చెప్పారు ఏ ఎంప్లాయిని(అవుట్ సోర్సింగ్ బేసిస్ పై ఉన్నవారిని)కూడా తీసేయ్యరాదని.
ఆర్టీసి ఆర్ధికపరిస్ధితుల దృష్ట్యా వారికి ఇమిడియెట్ గా జీతాలు ఇవ్వలేకపోతున్నాం.తర్వాత ఫేజ్ వైజ్ గా వారి జీతాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.