అధికంగా కరెంటు బిల్లుల పై పెంచిన చార్జీలను తక్షణమే తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ టి.డి.పి ఇంచార్జి డాక్టర్ జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రాణమయినా ఇస్తా, ప్రజలే నా దేవుళ్ళు అన్న వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి , ఈ రోజు అదే ప్రజల మీద మోయలేనంతగా ప్రభుత్వం భారం మోపుతుంటే అవేవీ తనకు సంబంధం లేనట్లుంటున్నారని ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
24 గంటలలో ఈ సమస్య స్పందించకపోతే, ప్రొద్దుటూరు టిడిపి ఉద్యమం చేస్తుందని ఆయన హెచ్చరించారు.
ప్రవీణ్ కుమార్ ఇంకా ఏమన్నారంటే…
మార్చి 5 నుండి మార్చి 31 వరకు ఒక బిల్ కొట్టాలని, ఎప్రిల్ 1 నుండి ఎప్రిల్ 30 వరకు ఒక బిల్ కొట్టాలని మే 1 నుండి మే 31 వరకు ఒక బిల్ కొట్టాలన్నారు .
ఏప్రిల్ 1 వ తారికున కరెంటు బిల్లులను పెంచి కొత్త టారిఫ్ ను బిల్ కొట్టడం వలన A క్యాటగిరి వారు B క్యాటగిరి లో రావలసిన బిల్లు C క్యాటగిరి లో పడటం వలన బిల్లు రేటు స్లాబ్ పెరిగింది.
ఈ లాక్ డౌన్ వలన రైతులు,కూలీలు,వ్యాపారాలు లేక తినడానికి తిండి లేక పస్తులుంటున్నారు. రోజు వారి రాబడి లేక వాళ్ల నానా ఆగచాట్లు పడుతున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వేలకు వేలు బిల్లు లను వసూలు చేయానుకోవడం ఏమిటి? వారు ఈ బిల్లు లను ఎలా కడతారు?
చికెన్, మటన్ షాపు లపై అమరావతి లో ని అధికారులతో మాట్లాడిన పొద్దుటూరు మ్మెల్యే గారు ఈ కరెంటు బిల్లుల విషయం లో ఎందుకు స్పందించలేదో అర్థం కావడం లేదు.
మీరు ఇంట్లోనే ఉండండి మీ అవసారాలు నేను తిరుస్తా, అన్న ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎందుకు స్పందించడమే లేదు
ప్రొద్దుటూరు లో 45 వేల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే గారు ఈ రోజు ప్రజలు ఇంత అవస్థ పడుతుంటే కనీసం పేపర్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లో లేడా ? ఇంత ఆధ్వాన్నంగా ఉందా ఎమ్మెల్యే గారి పరిస్థితి.
తన సొంత నిధులతో ఖర్చు పెడుతున్నానంటున్న ఎమ్మెల్యే గారు కరెంటు బిల్లుల లో ఎక్కువ గా వచ్చిన అమౌంట్ ను తన సొంత డబ్బు నుంచి కడితే ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.
ప్రజలు ఓట్లు వేస్తే గెలిపించిన నాయకుడు ఆదే ప్రజల సమస్యలకు స్పందించడంలేదు, వారికి కష్టాలలో ఎంత మాత్రం ఉపయోగపడటం లేదు. ఈ విషయాన్ని ప్రజలను గమనిస్తున్నారు.