కరోనా లాక్ డౌన్ వల్ల నిర్మానుష్యమయిన తిరుపతి, తిరుమలల కదలికలు ప్రారంభమవుతున్నాయి. లాక్ డౌన్ వల్ల మార్చి 19 నుంచి శ్రీవారి దర్శనాలు బంద్ అయ్యాయి. వాటితో పాటే లడ్డుల విక్రయాలు ఆగిపోయాయి. ఇప్పటికదాా 55 రోజుల పాటు శ్రీవారి దర్శనం కూడా బంద్ అయింది.
అయతే, స్వామి వారి నిత్య కైంకర్యాలను మాత్రం అర్చకులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇపుడు తిరుమల దర్శనమ్ మొదలవుతుందని అనుకుంటున్నారు. లాక్ డవున్ తర్వాత పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలనుకుంటున్నారు.
దీనికి టిటిడి అధికారులు సమాయత్తమవుతున్నారనేందుకు సంకేతంగా తిరుపతి దేవస్థాన శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ప్రారంభించారు. ఈ రోజు ఉదయం విక్రయాలు మళ్లీ ప్రారంభమయ్యాయి.
దిగువ తిరుపతిలోని ప్రధాన పరిపాలన భవనం వద్ద వీటిని విక్రయిస్తున్నారు. విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలియగానే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.
గంటకు మూడు వందల మంది చొప్పన సామాజిక దూరం పాటిస్తూ భక్తులను దర్శనానికి అనుమతించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బుకింగ్ మొత్తం ఆన్ లైన్ ద్వారానే ఉంటుంది.