సినిమా ధియోటర్ల చాప్టర్ క్లోజ్? కరోనా దెబ్బ, చిత్రాలిక OTT విడుదల

కరోనా లాక్ డౌన్ ఎత్తేసినా, చాలా రకాల ఆంక్షలు మన జీవితాల్ని శాసించబోతున్నాయి. కరోనా తర్వాత ప్రపంచ దేశాలలో సాంస్కృతిక జీవితం చాలా మారిపోతున్నది.
ఈ మార్పు రెండురంగాలల్ చాలా స్పష్టంగా కనిపిస్తూన్నట్లుంది. ఇందులో ఒకటి సినిమాలు. రెండోది పెళ్లిళ్లు.
ఈ రెండింటి ఏర్పాట్లు ఇపుడు భారీ పరిశ్రమలు. సినిమాల మీద ఆధారపడి ధియోటర్ వ్యవస్త నడుస్తూ ఉంది. వేలాది మంది ఉద్యోగులు సినిమా హాళ్ల మీద ఆధారపడి జీవిస్తున్నారు. అంతే ప్రతి కుటుంబానికి సినిమాకు వెళ్లడమనేది, వారానికో పదిరోజులకో సాగే ప్లెజర్ ట్రిప్ లాంటిది.ఈ ప్లెజర్ ట్రిప్  ఉద్యోగాలతో, చదువులతో సతమతమవుతున్నా కుటుంబాలకు ఎంత రిలీఫ్ ఇచ్చేది. ఇది అనుభూతి కనుమరుగయ్యే ప్రమాదం కనబడుతూ ఉంది.
 కరోనా సినిమా వ్యవస్థను కకా వికలం చేయబోతున్నది. ఎందుకంటే ఎక్కువ మందిని ఏకకాలంలో ఒకేచోట గుమికూర్చే ఏర్పాట్లలతో సినిమా హల్ ఒకటి.
సినిమా హాళ్లలో సామాజిక దూరంపాటించడం బాగా కష్టం. అందువల్ల కరోనా ప్రొటొకోల్  ప్రకారం  సినిమాహాళ్లను ఎపుడు తెరుస్తారో, తెరిచినా ఎలా నడిపిస్తారో తెలియడంలేదు.
మొత్తానికి సినిమా హాళ్లు ఇప్పుడున్నట్లు భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఎంత మందిని ఒక సినిమా షోకు అనుమతిస్తారో తలియదు.పెళ్లికి 50 మంది నిబంధన పెట్టారు. రష్ మీద అధారపడిన సినిమాకు ఇలాంటి నిబంధనసాధ్యం కాదు. ఎంత మంది చూశారనేది సినిమా విజయానికి కొలబద్ద. అలాంటపుడు సామాజిక దూరం పాటిస్తూ సినిమా హాళ్లలో సీట్లు తగ్గించడం సాధ్యమా?
మొత్తానికి సినిమా ధియోటర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సినిమాహాళ్లు పూర్తిగా తెరుచుునేదాకా సినిమాలను రిలీజ్ చేయకుండా సాధ్యమా? కాదు అందుకే సినిమాలను ప్రత్యామ్నాయ మార్గంలో విడుదల చేస్తున్నారు. ఇది సినిమా ధియోటర్లకు, ముఖ్యంగా ఐనాక్స్ వంటి మల్టిప్లెక్ష్స్ లకు పిడిగుపాటు.
ఇక పెళ్లిళ్ల విషయానికి వద్దాం. భారతదేశంలో పెళ్లి అనేది సోషల్ స్టేటస్ ప్రదర్శించే సాధనమయింది. అందుకే పెళ్లిళ్లు కోట్ల నుంచి వందలకోట్లు ఖర్చుచేసే తంతుగా మారింది. ఎంత ఖర్చు చేసే పెళ్లి చేస్తే అంత గొప్పవాడు, ఎంత మంది హాజరయితే అంత గొప్ప పెళ్లి అనే పరిస్థితి భారత దేశంలో వచ్చింది. ఈ సామాజిక వికారం మీద కరోనా కసి తీర్చుకుంటున్నది.
నిన్నకర్నాటక విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం పెళ్లికి 50 మందికి మించి గుమి కూడరాదు.ఈ సంఖ్యకు కూడా పర్మిషన్ అసవరం. పెళ్లితర్వాత వూరేగింపులుండవు, విందులుండవు. మద్యం పార్టీలుండవు. కోటీశ్వరులంతా తమ హోదాకు తక్కువగా పెళ్లి చేసే రోజు ఇప్పట్లో లేనట్లే. అయినా, పెళ్లిలో మూతికి మాస్క్ తగిలించుకుని కూర్చునే దృశ్యాన్ని వూహించనేలేం.
ఇపుడు మళ్లీ సినిమాల దగ్గరికొస్తాం. సినిమాలను ఇపుడు నేరుగా OTT (Over The Top) ప్లాట్ ఫామ్స్ అంటే అమెజాన్ ప్రైం వీడియో ,డిస్నీ, హాట్ స్టార్   ప్లాట్ ఫామ్స్ మీద విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
ఎందుకంటే ధియోటర్లు విడుదలకు ఎపుడు సిద్ధమవుతాయో అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది. కోట్లు ఖర్చు పెట్టి తీసిని సినిమాలను విడుదలచేసేందుకు అంతకాలం ఆగలేరు.  కాబట్టి డిజిటల్ మార్గంలో సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ మేరుకు ప్రాంతీయ చిత్రాలకు సంబంధించి నిన్ననే మలయాళం నుంచి ప్రకటన వెలువడింది. మలయాళ చిత్రం ‘సుఫియుం సుజాతం’ అనే చిత్రాన్ని అమెజాన్ ప్రైం లో విడుదలచేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. అదితిరావ్ హైదరీ, జయసూర్య నటించిన ఈచిత్రం ఇలా ఒటిటి లో టవిడుదలవుతున్న మొదటి ప్రాంతీయ చిత్రం.
ఈచిత్రం ప్రొడ్యూసర్ విజయబాబు ఈ విషయాన్ని నిన్న సోషల్ మీడియా ప్రకటంచారు. కరోనా అనిశ్చిత వాతావరణంలో ప్రపంచవ్యాపితంగా ఈ సినిమాను అమెజాన్ ప్రైంవీడియో విడుదల చేయాల్సి వస్తున్నదని  ప్రొడ్యూసర్ చెప్పారు.
లాక్ డౌన్ వల్ల విపరీతంగా నష్టపోయాం. ఈ చిత్రం మీద ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారు. వాళ్లందరికి కోసం తొలిప్రయత్నంగా ఇలా అమెజాన్ ప్రైం వీడియోలో విడుదలచేస్తున్నాం. తొలిప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి,’ అని ఆయన చెప్పారు.
ఇదేకాదు, మొత్తం అమెజాన్ ప్రైం వీడియో ద్వారా విడుదలయ్యేందుకు ఏడు బాలివుడ్, ప్రాంతీయ చిత్రాలు సిద్ధమయ్యాయి.
అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా చిత్రం ‘గులాబో సితాబో’, తమిళ చిత్రం ‘పొంగ్ మగల్ వంధాల్ ’ విద్యాబాలన్ చిత్రం ‘శకుంతలాదేవి’ లు కూడా ఉన్నాయి.
ఇదే సమయంలో డిస్నీ + హాట్ స్టార్ లు అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘లక్ష్మీ బాంబ్’ ను విడుదలచేసే లైసెన్స్ సంపాదించాయి. దుర్గావతి (భూమి పెడ్నేకర్) కార్గిల్ గర్ల్ (కరన్ జోహార్, ) ఝుండ్, చెహ్రే, (అమితాబ్ ), లుడో (అనురాగ్ బాసు ) చిత్రాలు కూడా ఒటిటి ప్లాట్ ఫామ్స్ మీద విడుదల చేసేందుకుచర్చలు సాగుతున్నాయి.
ఇలా చిత్రాలను సినిమా ధియోటర్ లలో కాకుండా డిజిటల్ మార్గంలో విడుదల చేయడాలనుకోవడంతో ఎగ్జిబిటర్స్ కు ప్రొడ్యూసర్స్ కు వైషమ్యాలు మొదలయ్యాయి.
గతంలో ఎపుడూ ఇలా నిర్మాతలు సినిమా ధియోటర్లను కాదనే పరిస్థితి లేదు. అవసరమూ రాలేదు. సాంకేతికాభివృద్ధి వల్ల  ఇపుడు పత్యామ్నాయం కనిపించింది. అవసరమూ వచ్చింది.  ఫలితంగా సినిమా ధియోటర్ల వ్యవస్థ ఉనికికే ముప్పు వచ్చింది.
ఒక వేళ ఇపుడు విడుదల కానున్న ఏడు చిత్రాలు అమెజాన్ ప్రైం విజయవంతమయితే సినిమా ప్రేక్షకుల సినిమా అనుభవమే మారిపోతుంది.
కేరళకు చెందిన ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గ నేజషన్ అపుడే విజయ బాబు చర్య మీద అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సంస్థ జనరల్ సెక్రెటరీ ఎంసి బాబీ ఒక ప్రకటన విడుదలచేస్తూ భవిష్యత్తు లో తాము విజయబాబు సహకరించమని అన్నారు.
జాతీయ స్థాయిలో ఇదే గొడవ నడుస్తూ ఉంది. ఇలాంటి నిర్ణయం పట్ల ఐనాక్స్ (INOX) తీవ్రంగా స్పందించింది. ఒక ప్రకటన విడుదల చేసింది. సినిమా ధియోటర్లను కాదని సినిమాలను ఒటిటి ప్లాట్ పామ్స్ మీద విడుదల చేయాలనుకోసం దురదృష్టకరమని, దీనిని పర్యవసానాలు ఆందోళనా కరంగా ఉంటాయని ఐనాక్స్ పేర్కొంది.

 

ఐనాక్స్, కంటెంటె క్రియోటర్స్ (చిత్ర నిర్మాతలు) ఎపుడు పరస్పర సహకారంతో ఉండే వారని, అదిఇరువురికి లాభదాయకంగా ఉండిందని, భాగస్వామ్యం ఎన్నో దశాబ్దాల ఒడిదుడుకులకు తట్టకుని నిలబడిందని, కష్టాల్లో పరస్పరం ఆదుకున్నారని పేర్కొంది.
ఇలాంటపుడు ఈ బంధాన్ని కష్టకాలంలో తెంచుకుని ఒక భాగస్వామి దూరంగా జరగడం న్యాయంకాదని ఐనాక్స్ పేర్కొంది.
ఇపుడు చిత్ర నిర్మాతలకు ఒక పెద్ద నైతిక సమస్య వచ్చిపడింది. కరోనా లాక్ డౌన్ ఎత్తివేసి సినిమా ధియోటర్లు పూర్తిగా నడిచే దాకా ఉండి సినిమాలను రిలీజ్ చేయడమా, లేక ఎపుడొ తెలియని కరోనా సంహారపు రోజు కోసం ఎదురు చూడకుండా ధియోటర్ వ్యవస్థను గాలికొదిలేసి ఒటిటి ప్లాట్ ఫామ్స్ లోకి మారడమా… ఇది సినిమా ప్రొడ్యూసర్లు ముందర ఉన్న సమస్య.
ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా ఇపుడు ఇదే పరిస్థితి.
మొత్తానికి సినిమా ధియోటర్ల వ్యవస్థకు ఉన్నట్లుండి గడ్డు రోజలులొచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వాల పాలసీల వల్ల చాలా వేలాది సింగిల్ స్క్రీన్ ధియోటర్లు మూతపడి పంక్షన్ హాల్స్ గా మారిపోయి. ఇపుడు కరోనా వల్ల మల్టి ప్లెక్స్ లకు ఇదే గతి పడుతున్నదమో అనిపిస్తుంది. ఈ రోజుల్లో పిల్లాపాపలతో వారాంతంలో  రిలాక్స్ అయేందుకు సినిమా ధియోటర్లకు పోవడం అర్బన్ కల్చర్లో ఒక భాగమయిపోయింది. ఇక ముందు సినిమా ధియోటర్లు కుటుంబాల ప్లెజర్ ట్రిప్స్ అనుకూలంగా ఉండవేమో అనిస్తూంది. శాశ్వతంగా కాకపోయినా, చాలా కాలం సినిమా ధియేటర్లకెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. ఒక వేళ వెళ్లినా, కరోనా భయం నిర్భీతిగా సినిమా చూసే రోజులు మళ్లీ రావేమో.
భయంగా భయంగా సినిమాచూడటం, ఆందోళనతో తిరిగిరావవడం ఉంటుంది. అందువల్ల ధియోటర్లో సినిమా చూస్తున్న అనుభూతి ఇక ఉండదేమో….