అమరావతి : వలసకూలీలపై పోలీసులు లాఠీ ఝళిపించారు . గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలోని తాడేపల్లిలో శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. తమ వూర్లకు పోయితీరతామని కూలీలు, పోయేందుకు వీల్లేదని పోలీసులు వాదులాడుకున్నారు. అంతే, పరిస్థితి లాఠీఛార్జి చేసే దాకా వెళ్లింది. వలస కూలీలు భయంతో పరుగు తీయాల్సి వచ్చింది.
వివరాలిలా ఉన్నాయి
ఈనెల 15వ తేదీ సాయంత్రం రహదారిపై కాలినడక పిల్లా జెల్లతో బారులు తీరి వెళ్తున్న కూలీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిగమనించారు. ఆమె కారాపి దిగివచ్చి వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుని వారు ఉండేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి స్వస్థలాలకు పంపించాలని అధికారులను ఆదేశించారు.
వీరంతా ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ లతో పాటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన కూలీలు. సుమారు వెయ్యి మంది దాకా ఉంటారు. వీరందరిని పోలీసులు అధికారుులు మొత్తానికి తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు తరలించారు.
https://trendingtelugunews.com/telugu/breaking/this-labourers-leaves-for-chattishgarh-carrying-children-in-kavadi/
వీరిలో కొంతమంది వారి ఊర్లకు కాలినడకన బయలుదేశారు. మరికొందరు సైకిళ్లపై వెళ్తున్నారు. అయితే, చాలా మందికి ఆంధ్రలో ఉండిపోవడం ఇష్టం లేదు అయితే, ఏమయినా సరే వారిని ఆపాలని పోలీసులు, అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే, వలసకూలీలను ఎక్కడి వారిని అక్కడ ఆపేయాలి,వారిని వూర్లకు పంపాల్సిన అవసరం లేదని , వారికి ఉచితంగా ఆహారం పంపిణీ చేయాలని కేంద్రం రాష్ట్రాలకు భారీగా నిధులందించింది కూడా. దానికితోడు వీరంతా తమ వూర్లకు పోతే, ఇకమళ్లీ తిరిగిరారని, రేపు లాక్ ఎత్తేశాక, పరిశ్రమలునడవాలన్న, నిర్మాణపు పనులుసాగాలన్న కూలీలు అవసరం. అపుడు వీరు అందుబాటులో లేకపోతే, లాక్ డౌన్ ఎత్తేసినా ఆర్థిక కార్యకలాపాలు సాగవు. కాబట్టి కూలీలను ఎలాగైనా ఎక్కడి వారిని అక్కడే ఆపేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి భోజనం పెట్టాలని కేంద్రం సలహా ఇచ్చింది.ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీలో దీనికి చాలా పెద్ద పీటవేశారు.
అయితే, ఈ ఉదయం పునరావాస కేంద్రంలో అల్పాహారం పంపిణీ చేస్తున్న క్రమంలో సైకిళ్లపై వచ్చిన కూలీలు కొందరు తమ రాష్ట్రాలకు తిరుగు ప్రయాణమయ్యారు.
సుమారు 150 మంది కూలీలు విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకోగానే పోలీసులు వారిని గుర్తించి పోయేందుకు వీలులేదని అడ్డుకున్నారు. అయితే, కూలీలు మాత్రం తాము ఉండలేమని తమ తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలని మొండికేశారు. ఈ వివాదం ఘర్షణ దాకా వచ్చింది. ఈక్రమంలో పోలీసులు లాఠీఛార్జి చేయడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు.
అనంతరం వారందరినీ విజయవాడ క్లబ్‌కు తీసుకొచ్చి వివరాలు నమోదు చేసుకుంటున్నారని ఈనాడు రాసింది.