కరీంనగర్ జిల్లా ఐకెపి సెంటర్ లోకి రాకుండా మాజీ ఎంపి, కాంగ్రస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఐకెపి సెంటర్లలోకి ధన్యాం కొనుగోలు జరుగుతున్నదని అక్కడికి కాంగ్రెస్ నాయకులకు ప్రవేశం లేదని పోలీసులు చెప్పారు. ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే జిఎం నెంబర్ 64 కింద అరెస్టు చేస్తామని కూడా పోలీసులు హెచ్చరించారు.
అసలేంజ రిగిందంటే…
సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ గంభీరావుపేట్ ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాల్లో ఉన్నటువంటి ఐకెపి సెంటర్ల వద్ద ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుంది .తాలు, తప్ప, తరుగు పేరుమీద విపరీతంగా రైతుకు నష్టం చేస్తూ ఉన్నారు. రైతుల కోరికమేరకు జిల్లా కాంగ్రెస్ మరియు మండల కాంగ్రెస్ నాయకత్వంతో కలసి పొన్నం ప్రభాకర్ ఈ రోజు (16/05/2020) ముస్తాబాద్ కు రావడం జరిగింది.
అయితే, స్థానిక పోలీసు అధికారులు జీవో నెంబర్ 64 ప్రకారం మీరు ఐకెపి సెంటర్లు తిరిగినట్లయితే అరెస్టు చేయడం జరుగుతుందని సందర్శనను అడ్డుకున్నారు.
అనంతరం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పొన్నం ప్రభాకర్ ఈ విషయం వెల్లడిస్తూ పోలీసుల వైఖరిని ఖండించారు.
‘రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం పరిష్కరించలేక పోతున్నది. అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది.ఈ విధంగా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను అణచివేస్తూ నియంతృత్వ ధోరణి తో పాలనను కొనసాగిస్తుంది,’ అని విమర్శించారు.