మామిడి పండ్ల ఆన్ లైన్ విక్రయానికి సంబంధించిన పోర్టల్ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు.
అగ్రోస్ సహకారంతో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లకు సేంద్రీయ మామిడిపండ్లు అందించేందుకు ఉద్దేశించిన ఈ పోర్టల్ అడ్రసు www.cropmandi.com
కరోనా సంక్షోభ సమయంలో రైతుల ఉత్పత్తులు ఈ పోర్టల్ ద్వారా వినియోగదారులకు చేరవేసేందుకు ఒక పోర్టల్ తెరిచినందుకు నిర్వాహకుడు లగ్గాని శ్రీనివాస్ ను ఆయన అభినందనందించారు.
‘కరోనాతో లాక్ డౌన్ తో అన్ని రంగాలలో సంక్షోభం నెలకొంది. ప్రపంచానికి అన్నం పెట్టే రైతాంగానికి అందరం బాసటగా నిలవాల్సిన సమయమిది. మామిడి, బత్తాయి తదితర పంటలను వినియోగదారుల ఇంటికే తరలించేందుకు ప్రభుత్వ సంస్థలతో పాటు వాటి సహకారంతో అనేక ఇతర సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఇందులో క్రాప్ మండి ఒకటి. కరోనా విపత్కర పరిస్థితులలో ఈ విధంగా అందరూ ముందుకు వచ్చి రైతులకు తోడ్పాటునివ్వడం సంతోషించదగ్గ విషయమని,’ ఈసందర్భంగా ప్రసంగిస్తూ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.