పోతిరెడ్డిపాడు పై ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 203 ని నిలుపుదల చెయ్యాలని కేంద్ర అభిప్రాయపడింది. దీని మీద ఆంధ్రప్రదేశ్ సలహా ఇవ్వాలని కేంద్ర జలవనరుల శాఖ కృష్ణా నది నిర్వహణ మండలి(Krishna River Management Board-KRMB)కి సూచించింది.
ఆంధ్రప్రదేశ ప్రభుత్వం తెచ్చిన జివొ మీద కరీం నగర్ ఎంపి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఫిర్యాదు చేతర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈవిషయాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షేఖావత్ ఒక లేఖ ద్వారా ఆయనకు తెలియ చేసింది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపు పై గారికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన రెండు రోజుల కిందట లేఖ రాశారు.
” కృష్ణా జలాలను తోడుకునేందుకు పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు తదితర ప్రాజక్టులను చేపట్టేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జివొ 202 తీసుకు వచ్చిందని మీరు రాసిన లేఖ అందింది. దీనిని జలవనరుల శాఖ లో పరిశీలించారు. వెంటనే కృష్ణా బోర్డు ను సమావేశపర్చాలని బోర్డును ఆదేశించాను. అాదే విధంగా ఆంధప్రదేశ్ చేపట్టాలనుకుంటున్న ప్రాజక్టుల డిపిఆర్ లు 2014- ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న కృష్ణా జలలాల పంపకం నియమాలకు అనుగుణంగా ఉన్నాయోలేదో చూడాలని కూడా ఆదేశించారు.ఈ పరిశీలన పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ ముందుకు పోకుండా ఆ ప్రాజక్టులను అపేలా చూడాలని కూడా బోర్డును ఆదేశించాం,’ కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ లేఖ లో పేర్కొన్నారు. ఇదిగో ఇదే లేఖ