కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న కర్నూలు జిల్లా మరో మైలు రాయిని అధిగమించింది. జిల్లాలో కనిపిస్తున్నకొత్త కేసుల కంటే ఆసుపత్రుల నుంచి చికిత్స తీసుకుని విడుదలవుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజు ఒక్కరోజున 47 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీనితో మొత్తంగాకర్నూలు జిల్లానుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 390 కి చేరింది. ఇపుడుజిల్లాలో ఉన్న యాక్టివ్ కోవిడ్ పేషంట్లు 191 మంది మాత్రమే.
మొన్నటి దాకా కర్నూలు జిల్లా కరోనా కేసులలో రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఉండి ‘కరోనా కర్నూలు’ జిల్లాకు పేరుపడింది. అలాంటి జిల్లాలో ఇపుడు పరిస్థితి శరవేగంగా మెరుగుపడుతూ ఉంది.
ఈ రోజు ఆసుపత్రి నుండి ఇంటి ముఖం పట్టిన 47 మందిలో మామూలు 17 మంది కర్నూలు చైతన్య కాలేజ్ ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్ నుండి డిశ్చార్చ్ కావడం విశేషమని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు.
ఈ రోజు డిశ్చార్చ్ అయిన 47 మందిలో కర్నూలు చైతన్య కాలేజ్ కోవిడ్ కేర్ సెంటర్ నుండి 17 మంది, నంద్యాల శాంతిరామ్ జిల్లా స్థాయి ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రి నుండి 12 మంది, కర్నూలు సమీపంలో ఉన్న విశ్వభారతి జిల్లా స్థాయి ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రి నుండి 9 మంది, కర్నూలు జిజిహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రి నుండి 9 మంది ఉన్నారు. వీరంతా ఆరోగ్యంగా కోలుకుని కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించిన రెండు వరుస టెస్టుల్లో నెగెటివ్ ఫలితం రావడంతో ఇంటిదారి పట్టారు. వీరందరికి ప్పట్లతో అభినందనలు తెలిపి, ప్రత్యేక అంబులెన్స్ వాహనాల్లో వారి వారి ఇళ్లకు పంపారు. ఈ ఘనవిజయానికి కృషి చేసిన డాక్టర్లకు అధికారులకు వైద్య సిబ్బందికిి కలెక్టర్ వీరపాండియన్ అభినందనలు చెప్పారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం డిశ్చార్చ్ అయిన ఒక్కొక్క కరోనా విజేతకు రూ 2000/- లుబ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేశారు.