ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఇరిగేషన్ శాఖ 203 జీఓ అమలైతే శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అవుతుందని తెలంగాణా జన సమితి (టిజెఎస్) నాయకుడు ప్రొఫెసర్ కోదండర్ రామ్ వ్యాఖ్యానించారు.
ఈ జివో పేర్కొన్నట్లు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నిర్మాణం చేసి, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ 80,000 క్యూసెక్కుల నీరు తీసుకుపోయేటట్లు అప్ గ్రేడ్ చేస్తే ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారుతాయని ఆయన హెచ్చరించారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఈరోజు ఇతర ప్రతిపక్ష నేతలతో కలసి ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ను కలుసు కృష్ణా నది జలాల పరిరక్షణ పై ప్రభుత్వ చూపిస్తున్న నిర్లక్ష్యం గురించి వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
ఆంధ్ర ఈ జీవో 203 ఉప సహరణ కోసం ప్రభుత్వం కృషి చేయాలి.
తెలంగాణ కృష్ణా నదిపైన ఉన్న ప్రాజెక్టులన్నీ సత్వరమే పూర్తి చేయాలి.
లేదంటే 1990 కల్వకుర్తి కోసం జరిగిన తరహాలో పోరాటం చేస్తాం.
సిపిఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
ఏపీ సీఎం కృష్ణా నది నుంచి పోతిరెడ్డి పాడు ను అప్ గ్రేడ్ చేసి 44వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కులు తీసుకుంటున్నాడు
అందువల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే 80వేల క్యూసెక్కుల నీటి తరలింపు జీవో 203 ఉపసంహరణకు కృషి చేయాలి.
ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.
ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాలి.
అవసరమైతే ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధం కావాలి.
కృష్ణా నదీ జలాలు పరిరక్షించక పోతే… భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం.