ఒకేసారి ఆరువేల మందిపై అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మీద ఏపీ ఎస్ ఆర్టీసి కరోనా లాక్ డౌన్ వేటు వేసింది. బస్సులు తిరగనుందన, రెవిన్యూ లేక ఖర్చు తగ్గించుకునేందుకు ఆర్టీసి సంస్థలకు చాకిరీ చేసే అవుట్ సోర్సింగ్ లను తొలగించేసి భారం దించుకుంది.
నేటి నుంచి విధులకు హాజరుకావొద్దంటూ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు అధికారులు చెబుతున్నారు.
మరొక వారికి ఏప్రిల్ నెల వేతనాలు కూడా ఇంకా చెల్లించలేదు.
అయితే, కార్మిక సంఘాలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు తీవ్రంగా ఖండించాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. బాలకాశి, కార్యదర్శి నూర్ మొహమ్మద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.