లాక్ డౌన్ ఎత్తి వేత తర్వాత తిరుమల శ్రీవారి దర్శనాలను ఎలా పునరుద్దరించాలనే దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) చర్చిస్తున్నది.
లాక్ డౌన్ ఎత్తేశాక కూడా కరోనా నుంచి విముక్తి అయినట్టు కాదుకాబట్టి కరోనా ప్రోటోకోల్ ప్రకారం భక్తలను అనుమతించే విషయం టిటిడి యోచిస్తున్నట్లు సమాచారం. అందువల్ల లాక్ డౌన్ అనంతరం దినమంతా దర్శనాలుండకపోవచ్చు.
తిరుమల ఆలయాన్ని మొదట మార్చి 19 వ తేదీ సాయంకాంల నుంచి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూసేయాల్సి వచ్చింది. రోజూ సగటున 80 వేల మంది దాకా భక్తులు సందర్శించే వారు. ఇలా భక్తులతో 24గంటలు కిటకిటలాడే తిరుమల ఇపుడు నిర్మానుష్యమయింది. గుడిని మూసేయాలనే నిర్ణయం తీసుకునేటప్పటకనే కరోనా వైరస్ వ్యాప్తి వల్ల భక్తుల రాక 35 వేల నుంచి 40వేల కు పడిపోయింది.
మొదట మార్చి 31 వరకు గుడిని మూసేశారు. తర్వాత దీనిని ఏప్రిల్ 14దాకా పొడిగించారు. తర్వాతలాక్ డౌన్ పొడిగించినపుడు భక్తులదర్శనాలను పొడిగించక తప్పడం లేదు. ఆలయంలో పుల నిత్యపూజాకార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆలయ చరిత్రలో ఇంకా కాలం భక్తులురాకుండా గేట్లు మూత పడిందిదే. ఇపుడు మళ్లీ పూర్వపు పరిస్థితి ఎపుడోస్తుందో తెలియడం లేదు.
ఎందుకంటే, కరోనా వైరస్ పూర్తిగా అంతరించిపోయేదాకా కోవిడ్ ప్రొటకోల్ అమలులో ఉంటుంది. తిరుమలకు దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి శ్రీవారి దర్శనానికి ప్రజలు వచ్చే అవకాశం ఉండటం, సాధారణ రోజుల్లో లాగా క్యూలైన్లను క్రిక్కిరిసి అమలుచేయడం ఇక ముందు సాధ్యం కాదకాబట్టి తిరుమల మనుపటి కళ ఇప్పట్లో తిరిగిరాదని అనుకుంటున్నారు. టిటిడికి భక్తుల తాకిడి ఎక్కువ కాబట్ట ప్రత్యేక కోవిడ్ ఎగ్జిట్ పాలసీని రూపొందించేందుకు టిటిడి ప్రయత్నాలు చేస్తున్నది.
టిటిడి వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం,ప్రతి రోజు 14 గంటల పాటు భక్తులును దర్శనానికి అనుమతించాలనుకుంటున్నది.
గంటకి 5 వందల మంది భక్తులును మాత్రమే దర్శనానికి అనుమతించే విషయం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
మొదటి మూడు రోజుల పాటు టిటిడి ఉద్యోగులును అనుమతించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి.
అటు తరువాతా తిరుమల, తిరుపతిలో వున్న స్థానికులు ను ప్రయోగాత్మకంగా 15 రోజులు పాటు అనుమతించవచ్చు.
రోజుకి 7 వేల మందికి మాత్రం దర్శనం పరిమితం చేస్తారు. తిరుమల కౌంటర్లను అపుడే తెరవరు. ఆన్ లైన్ లో స్లాట్ ద్వారా టిక్కేట్లును బుక్ చేసుకునేలా ఏర్పాట్లుచేస్తున్నారు.
మొదట సర్వదర్శనం,ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును భక్తులుకు అందుభాటులో వుంచుతారు.
టిక్కేట్లును పోందిన భక్తులును మాత్రమే అలిపిరి వద్ద అనుమతిస్తారు.
ప్రయోగాత్మక పరిశిలన పూర్తి అయిన తరువాత అంచెలు వారిగా చిత్తూరు జిల్లా వాసులు, ఆపైన రాష్ట్రంలో ఇతర ప్రాంతాల భక్తులును అనుమతించాలని భావిస్తున్నారు.
వసతి గదులును ఇద్దరికి మాత్రమే పరిమితం చేస్తారు.
అలిపిరి, నడకమార్గంలోనే భక్తులును క్షుణంగా తనిఖి చేసిన తర్వాత అనుమతిస్తారు. కరోనా వైరస్ నుంచి పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత అందరిని దర్శనానికి అనుమతిస్తారు.ఆ రోజు ఎపుడొస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.