రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జీతాన్ని30 శాతం తగ్గించుకున్నారు.ఇలా ఈ సంవత్సరమంతా ఆయన 30 శాతం తక్కువ జీతం తీసుకుంటారు. రాష్ట్రపతి నెలజీతం రు. 5ల క్షలు. ఇప్పటి నుంచి ఇందులో 30 శాతం కోత ఉంటుంది. అంతేకాదు, రాష్ట్రపతి భవన్ బడ్జెట్ కూడా 20 శాతం తగ్గించాలని నిర్ణయించారు.
రాష్ట్రపతి భవన్ వార్షిక బడ్జెట్ రు.200 కోట్లు.ఇందులో రు. 80.98 కోట్లు రాష్ట్రపతి అలవెన్సులు. ఇంటి ఖర్చలు, స్టాప్ ఖర్చులుంటాయి. ఇపుడు పొదుపుపాటిస్తే ఏడాది సుమారు 40-4 5 కోట్ల దాకా అవుతుంది. ఇలాగే పదికోట్ల రుపాయలతోకొనాలనుకుంటున్న ప్రెసిడెన్షియల్ లిమజిన్ ( లగ్జీర కారు)ను ఇప్పట్లో కొనకుండా వాయిదా వేసుకున్నారు.
అదే విధంగా కోవిడ్ నేపథ్యంలో అనేక పొదుపు చర్యలు కూడా చేపడుతున్నారు. సోషల్ డిస్టెన్స్ నియమాలు పాటించేందుకున దేశీయ, విదేశీ ప్రయాణాలను కూడా బాగా తగ్గించుకుంటున్నారు. ఇతర ఖర్చలను కూడా రాష్ట్రపతి తగ్గించుకుంటున్నారని రాష్ట్ర పతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇక ముందురాష్ట్రపతి కూడా ఆన్ లైన్ అవుతారు. టెక్నాలజీ వినియోగించుకునే తన కార్యకలాపాలను కొనసాగిస్తారు.