రాష్ట్ర ప్రజల క్రియాశీల సహకారంతో ప్రభుత్వం వైరస్ నియంత్రణకు నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రక్రియలో భాగంగా, రాష్ట్ర సరిహద్దులు పూర్తిగా మూసివేయబడ్డాయి.
అయినప్పటికీ, కిరాణా, ఇతర నిత్యావసర వస్తువులు పౌరులకు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.
ఈ పరిస్థితిలో కొంతమంది ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ తో ప్రయాణించేవారు, కుటుంబంలో మరణం, సామాజిక పనుల కోసం, ప్రభుత్వ విధి నిర్వహణలో లేదా ఇతర అత్యవసరమైన వాటి కోసం ప్రయాణించడానికి ఇక్కట్లు పడుతునట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది.
ఈ సమస్యలను పరిష్కరించడానికి, ప్రయాణానికి అవసరమైన వారికి పాస్ ఇవ్వమని పోలీసు శాఖను ఆదేశించారు. ముఖ్యమైన పని నిమిత్తం మాత్రమే ప్రజలు, పౌరులు E-PASS (ఈ-పాస్)ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
అత్యవసర పాస్‌ల కోసం అభ్యర్థించే వారు ఈ క్రింది సమాచారాన్ని అందించాలి:
1. ఫోటోతో పాటు పూర్తి పేరు, మొబైల్ నంబర్
2. మెడికల్ సర్టిఫికెట్లు, అధికారిక లేఖలు మొదలైనవి అప్లోడ్.
3. ఆధార్‌ను అప్లోడ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు
4. పూర్తి ప్రయాణ వివరాలు.
5. ప్రయాణించే వాహన పూర్తి వివరాలు, ప్రయాణీకుల సంఖ్య. కారుకు (1+3) అనుమతి.
Https:citizen.appolice.gov.in వెబ్సైట్లో పైన పేర్కొన్న అన్ని వివరాలతో పౌరులు/ ప్రజలు కోవిడ్ 19 అత్యవసర వాహన e-pass కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆమోదించబడితే వాహన అత్యవసర e-pass ను దరఖాస్తు చేసుకున్నా వారి మొబైల్ నెం లేదా మీరు దరఖాస్తు చేసిన మెయిల్ ఐడికి పంపబడతాయి. వెబ్సైట్ నుండి జారీ చేసిన అత్యవసర పాస్‌లు మాత్రమే అంగీకరించబడతాయి. అత్యవసర వాహన పాస్‌తో పాటు, పౌరులు ప్రయాణించేటప్పుడు వారి ఒరిజినల్ ఐడి కార్డును కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలి. సమర్పించిన వివరాల ధృవీకరణ తరువాత, వీలైనంత త్వరగా ఈ-పాస్ జారీచేస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై తగిన చర్యలు తీసుకుంటారు.
(Press note issued by the Chief Public Relations Officer(CPRO) to DGP, Andhra Pradesh)