సర్ రోనాల్డ్ రాస్ KCB KCMG FRS FRCS కి మలేరియా రోగ కారణమయిన పరాన్నజీవిని కనిపెట్టినందుకు 1902లో ఫిజియాలజీ/ వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
1897 లో ఆడ ఎనాఫిలస్ దోమ ప్రేగులలో మలేరియా పరాన్నజీవిని రాస్ కనుపెట్టి మలేరియా వ్యాధి దోమల ద్వారా ఎలా వ్యాపిస్తుందో ప్రపంచానికి చూపించాడు. అంతకు ముందు ఈ వ్యాధి గాలి మార్పుల నుంచి వస్తుందని నమ్మే వారు. శాస్త్రవేత్త ప్రపంచంలో మాత్రం ఒక సవాల్ గా ఉండింది. దోమల ద్వారా వ్యాపిస్తుందేమోనని కొంతమంది శాస్త్రవేత్త అనుమానిస్తున్నారు. వారిలో రాస్ ఒకరు. మరొక విషయం ఆయన పరిశోధనలు బ్రిటిష్ ఇండియా సైనికుల్లో వస్తున్న మలేరియా మీద జరిపారు.బ్రిటిష్ సైన్యం లేకపోతే, రాస్ ఇండియావచ్చే వాడే కాదు. మలేరియా పరిశోధనలు చేసేవాడే కాదేమో. వలసవాదానికి, మలేరియా చాలా సంబంధం ఉంది. దీని మీద చాలా పరిశోధన జరిగింది. వలసవాదం,మలేరియా ల సంబంధం మీద Why Nations Fail: The Origins of Power, Prosperity and Poverty అనే పేరుతో Daron Acemoglu, James A.Robinson అనే ఇద్దరు చరిత్ర కారులు అద్భతమయిన పుస్తకం రాశారు. మీరు తప్పక చదవండి.
మళ్లీ రాస్ దగ్గరికి వద్దాం. పెద్దయ్యాక డాక్టర్ కావాలని రాస్ ఎపుడూ కలలు కనలేదు. అయితే,కొడుకు డాక్టర్ కావాలని ఆయన తండ్రి కాంక్షించే వాడు. దీని ప్రకారమే 17వ యేట మెడిసిన్ చదివేందుకు ఒప్పుకోవలసి వచ్చింది.
రొనాల్డ్ రాస్ భారత దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరాలో 13-5-1857 జన్మించాడు. అతని తండ్రి కాంప్‌బెల్ క్లాయె గ్రాంట్ రాస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో జనరల్ గా పనిచేసేవాడు. రాస్ వైద్యశాస్త్రాన్ని లండన్ లోని సెయింట్ బార్తొలోమ్ హాస్పిటల్ లో 1875 – 1880 మధ్య పూర్తిచేశాడు. 1879 లో, అతను “రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్” పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. వైద్య విద్య అభ్యసిస్తున్నపుడే ట్రాన్స్ ఎట్లాంటిక్ స్టీమ్ షిప్ లో షిప్ సర్జన్ ఉద్యోగానికి అప్లయి చేశాడు. ఉద్యోగం వచ్చింది. దీనితో ఆయన లైసెన్సియేట్ ఆఫ్ ది సొసైటీ ఆఫ్ ఎపొధికెరీస్ (Licentiate of the Society of Apthecaries) అయ్యారు. ఈ అర్హతతోనే 1881లో ఇండియన్ మెడికల్ సర్వీస్ లోకి ప్రవేశించారు. అప్పటి ఇండియాలో మద్రాసు, బర్మా, అండమాన్స్ ద్వీపాలల్ కొద్ది రోజులు పనిచేశారు. 1888-89 మధ్య సెలవుల్లో ఉన్నపుడు ఆయన కు సైంటిఫిక్ పరోధన మీద దృఫ్టిపెట్టాడు. ఇంగ్లండులోని రాయల్ కాలేజెస్ ఆప్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ నుంచి పబ్లిక్ హెల్త్ లో డిప్లమాసాధించారు. అపుడే ప్రొఫెసర్ ఇ ఇ క్లెయిన్ దగ్గిర బ్యాక్టీరియాలజీలో ఒక కోర్సు చేశారు. తర్వాత స్టాఫ్ సర్జన్ గా బెంగుళూరు రాబోతున్నారు. అపుడే ఆయన రోజా బాక్సమ్ తో వివాహమయింది.
1892లో ఆయన లోని సైంటిస్టు కన్ను మలేరియా మీద పడింది. అప్పిటికే దోమల ద్వారా బ్యాక్టిరాయ వ్యాపిస్తూఉందని తెలిసింది. ఆయనకు బాగా తెలిసిన ప్రొఫెసర్ ప్యాట్రిక్ మేన్సన్ ఎలిఫెంటియాసిస్ మీద పరిశోధనలు చేస్తున్నారు. 1894లో ఒక సారి రాస్ శెలవులు మీద ఇంగ్లండు వెళ్లినపుడు మనిషి నుంచి దోమలకు బ్యాక్టిరియా ఎలా వెళ్తుందో చూపించాడు. అపుడే రాస్ కు మలేరియా బ్యాక్టీరియా కూడామనిషి రక్తంలో ఉండి ఉండాలని అనుమానించాడు. 1895లో రాస్ ఇండియా తిరిగొచ్చాడు. అప్పటికే ఎల్పాన్స్ లావెరన్ అనే వైద్యుడు మాన్సన్ లాగనే మలేరియా దోమలద్వార వ్యాపిస్తూ ఉందని సైద్ధాంతికంగా చెబుతూ వస్తున్నారు. దీనిని ప్రూవ్ చేయాలనుకున్నాడు రాస్. అయితే, అప్పటి ప్రభుత్వం ఆయనను ఉన్నట్లుండి మలేరియా మద్రాసునుంచి మలేరియా లేని రాజ్ పుతానాకు ట్రాన్స్ ఫర్ చేసింది. ఇది రాస్ కు నచ్చలేదు. తన పరిశోధనకు ఇది అడ్డంకి నిరసన తెలిపారు. తనను మద్రాసులోనే ఉంచకపోతే రాజీనామా చేస్తానని బెదిరించారు. ఎన్నో విజ్ఞప్తులు పంపాడు. చివరుకు ప్రొఫెసర్ ప్యాట్రిక్ మాన్సన్ కూడా జోక్యం చేసుకుని భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అపుడు ప్రభుత్వం దిగివచ్చిన ఒక ఏడాది పాటు మలేరియా, కాలా అజర్ (Visceral Leishmaniasis)లమీద పరిశోధన చేసేందుకు స్పెషల్ అప్పాయంట్ మెంట్ ఇచ్చింది.
అపుడాయన సికిందరాబాద్ లో ఉన్నారు. 1897 ఆగస్టు 20న రాస్ మొతానికి మలేరియా గుట్టు విప్పారు. దీనికోసం ఆయన ఒక ప్రయోగం చేశారు. కొన్ని ఎనాఫిలిస్ దోమలకు మలేరియా రోగి రక్తం బాగా పీల్చే అవకాశమిచ్చారు. తర్వాత ఈ దోమలను డిసెక్ట్ చేశారు. చిత్రం. ఈ దోమల కడుపు కణాలలో మలేరియా పరాన్నజీవిని కనుగొన్నారు. అంతే, మలేరియా వ్యాధిని ఎనాఫిలిస్ దోమలు వ్యాప్తి చేస్తున్నాయని ఆయనకు ఎన్నో రోజులుగా ఉన్న అనుమానం నిజమయింది.
ఇండియాలో మలేరియామీద తన పరిశోధన కొనసాగించారు. పక్షుల్లో కూడా మలేరియా పరిశోధనలు చేశారు. 1898 నాటికి ఆయన పక్షుల్లో మలేరియాకు కూడా దోమలు Intermediate host గా సహకరిస్తున్నాయని కనుగొన్నాడు. మలేరియాతో చచ్చిపోయిన పక్షలను దోమలకు ఆహారంగా వేశాడు. తర్వాత ఈ దోమలను పరిశీలిస్తే, దోమల్లో మలేరియా బ్యాక్టీరియా అభివృద్ధి చెందిన లాలాజల గ్రంధులదాకా వ్యాపిస్తూ ఉందని కనుగొన్నాడు. ఈ దోమలే పక్షలను కుట్టినపుడు వాటిలో మలేరియా రావడం ఆయన చూశాడు.
1899లో రాస్ ఇండియన్ మెడికల్ సర్వీస్ కు రాజీనామా చేసి ఇంగ్లండు తిరిగొచ్చాడు.అక్కడ లివర్ పూల్ స్కూల్ ఆప్ ట్రాపికల్ మెడిసిన్ పనిచేయడం మొదలుపెట్టారు. అక్కడ ఆయన మలేరియా నివారణ పద్ధతుల మీద పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. ఆయన మలేరియా మీద చేసిన పరిశోధనలకు(… for his work on malaria, by which he has shown how it entres the organism and there by laid the foundation for successful research on this disease and methods of combating it.) 1902లో నోబెల్ బహుమతి ప్రకటించారు. డిసెంబర్ 12, 1902 న ఆయన నోబెల్ బహుమతి స్వీకరిస్తూ నోబెల్ ఉపన్యాసం ఇచ్చారు. మలేరియా మీద పరిశోధన చేస్తున్నపుడు తాను కూడా మలేరియా బారిన పడిన విషయాన్ని ఈ ఉపన్యాసం లోప్రస్తావించారు.
The Sigur Ghat (1897). I arrived at Ootacamund, the great hill station of the Nilgherry Hills, at the beginning of April, 1896. This station which is about 8,000 feet above sea-level, is surrounded by numerous tea and coffee plantations, scattered here and there in the rich valleys of the hills, and even for some distance out on the plains which encompass the hills like a sea. After enquiry it was determined to begin the investigation in the Sigur Ghat, a long natural trench which cuts at one stroke from the Ootacamund plateau right down to the plain, and which had the worst reputation for malaria. A dâk bungalow (rest house) and a small plantation existed near the top of the trench, at a place called Kahutti about 5,500 feet above sea-level; and owing to the fact that a single night spent lower down the valley was thought enough to ensure a bad and perhaps fatal attack, I determined to lodge here and visit the lower valley only during the day time. Nevertheless even at Kalhutti I found almost everyone suffering from fever – which was ascribed to miasmata floating up the ravine from the plains below; and I had been there only a few days and had paid only one diurnal visit to the plain when I myself suffered a bad attack of aestivo-autumnal infection, the diagnosis being confirmed by the microscope. After two weeks’ energetic treatment with quinine I was well enough to resume operations. (Source: Nobel Lecture)
అతని జ్ఞాపకార్థం, హైదరాబాద్ లోని ప్రాంతీయ అంటు వ్యాధి ఆసుపత్రి (fever hospital) కి సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికేషన్ డిసీజెస్ అని పేరు పెట్టారు.
బేగంపేట విమానాశ్రయానికి సమీపంలో సికింద్రాబాద్‌లో రాస్ మలేరియా పరాన్నజీవిని కనుగొన్న భవనాన్ని ఒక వారసత్వ ప్రదేశంగా (heritage structure) ప్రకటించారు.ఆ భవనానికి వెళ్లే దారికి సర్ రోనాల్డ్ రాస్ రోడ్ అని పేరుపెట్టారు. రోనాల్డ్ రాస్ జ్ఞాపకార్థం భారత తపాలాశాఖ 1997లో ఒక పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. 1932 సెప్టెంబరు 16 న తన 75 వ ఏట లండన్, (యు.కె )లో ఆయన మరణించారు.