చిత్తూరు, మే13 : ఒడిసా రాష్ట్రం నుండి వివిధ పనులపై జిల్లాకు వచ్చి లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఉండి పోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక శ్రామిక్ రైలు ద్వారా పంపించారు.
ఒడిసా రాష్ట్రంనకు చెందిన వలస కార్మికులు, వివిధ పనుల నిమిత్తం జిల్లాకు వచ్చి లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయిన వారు వారి వివరాలను సంబంధిత తహశీల్దార్లు కు అందించగా స్పందన వెబ్ సైట్ నందు వివరాలను అప్ లోడ్ చేయ డం జరిగింది.
వారందరికీ ఈ- పాస్ జనరేట్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక శ్రామిక్ రైలు ద్వారా ఒడిస్సా రాష్ట్రా నికి 1413 మందిని పంప డం జరిగింది.
ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్త తెలిపారు.
ఒడిసా రాష్ట్రానికి వెళ్లే వారికి గత 3 రోజుల ముందుగానే పరీక్షలు నిర్వహించడం జరిగిందని, మరలా నేడు చిత్తూరు రైల్వే స్టేషన్ లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి వారికి అవసర మైన భోజనం, త్రాగునీరు వారికి అందించడంతో పాటు తగు జాగ్రత్తలు తీసు కుంటూ పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
కూలీలను సొంత రాష్ట్రానికి పంపే ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తో పాటు జెసి డి. మార్కం డేయులు, జిల్లా కోవిడ్ – 19 నోడల్ అధికారి చంద్ర మౌళి, చిత్తూరు ఆర్డిఓ రేణుక, కలెక్టరేట్ ఏఓ గోపాలయ్య, సంబంధిత మండల తహశీల్దార్లు, ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మధ్యాహ్నం 3 గంటల కు ఒడిసా కు బయలుదేరిన ప్రత్యేక శ్రామిక్ రైలు కు కరతాళ ధ్వనుల తో రైల్వే పోలీసులు, రెవెన్యూ అధికారులు వీడ్కోలు పలికారు.