తెలంగాణ రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గిపోతూ ఉంది. ఇందొక మంచి పరిణామం. అంటే తెలంగాణలో కోవిడ్-19 రోగులు చికిత్స తీసుకుని జబ్బు నయం చేసుకుని హ్యపీగా ఇంటికెళ్లి పోతున్నారని అర్థం. ఈ రోజు తెలంగాణా ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటీన్ ప్రకారం రాష్ట్రంలోని కోవిడ్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య కేవలం394 మంది మాత్రమే.
నిజానికి పాజిటివ్ కేసులు పెరుగుతున్నా, ఆసుపత్రుల నుంచి విడుదలవతున్న వారి సంఖ్య బాగా పెరుగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గిపోతూ ఉంది.
ఈ రోజు రాష్ట్రంలో 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటి వరకు రాష్ట్రం లో నమోదయిన పాజిటివ్ కేసులు 1367. ఇప్పటివరకు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 939. ఈ రోజు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 117 మంది. అయితే, కొత్త కనిపించిన పాజిటివ్ కేసుల కంటే మూడింతలు ఎక్కువగా జబ్బు నయం చేసుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. ఈ రోజు చనిపోయిన వారు ఇద్దరు.
ఈ రోజు నమోదయిన కొత్త కేసులలో ఒక్కజిహెచ్ ఎంసినుంచే 31 ఉన్నారు. మిగతా పది మంది ఇతర రాష్ట్రాలనుంచి వచ్చినవారిన ఆరోగ్య శాఖ చెప్పింది.
రాష్ట్రంలో వరంగల్ రూరల్, వనపర్తి, యాదగిరి జిల్లాలో కరోనా కేసులు మొదటి నుంచి నిల్. మరొక 25 జిల్లాలలో గత 14రోజుల నుంచి కరోనా కేసులే లేవు. ఈ జిల్లాలు ఇవే :