కర్నూలు మూడేళ్ల పాప కరొనా సాహస గాథ

క్వారంటైన్ అనేది ఒక విధంగా నరకమే. ముఖ్యంగా మనదేశంలో క్వారంటైన్ వార్డులలో జీవితం మీద నిరాశపరిచే చాలా కథనాలు మీడియాలో వస్తున్నాయి.
ఏమయినా సరే క్వారంటైన్ అనేది దుర్భరంగానే ఉంటుంది. మీరు కరోనా పాజిటివ్ అని తెలిశాక క్వారంటైన్ వార్డుకి చేరుస్తారు. అక్కడ మీకు డాక్టర్లు నర్సులు తప్ప మరొకరితో సంబంధం ఉండదు. పేషంట్లు ఒకరితో ఒకరు పెద్దగా మాట్లాడుకోరు. మీ కోసం బంధువులెవరూ వస్తూ ఉండరు. ఆంధ్రలో కొందరికి 24 రోజుల క్వారంటైన్ ఉంది. ఇంతకాలం సాధారణ రోగాలకు ఆసుప్రతిలో ఉండాల్సిన పనిలేదు. ఇపుడు గుండె సర్జరీ జరిగాక కూడా వారంరోజులలో ఇంటికొస్తున్నారు.

https://trendingtelugunews.com/english/features/june-almeida-discoverer-of-coronavirus-had-no-formal-education/

అలాంటపు ఆసుపత్రిలో 24 రోజులు అందునా బయటి ప్రపంచంతో సంబంధం లేకుడా ఉండటం బాగా కష్టం. అందునా పాజిటివ్ రోగి , మూడేళ్ల పాప అయితే, మరీ కష్టంగా ఉంటుంది.అది బాగా మారాము చేసేవయసు. ఈవయసులో తల్లితండ్రులకు, సాటిపిల్లలకు దూరంగా ఉండటం బాగా కష్టం. ఒక రోజుకాదు, రెండు రోజుల కాదు,ఏకంగా 14 రోజులు. అయితే, కర్నూలు కు చెందిన ఒక మూడేళ్ల పాప క్వారంటైన్ నుంచి అజేయంగా తిరిగివచ్చింది. కరోనాను జయించిన ఈ పాపని నిన్న ఆసుపత్రినుంచి విడుదల చేశారు.

https://trendingtelugunews.com/telugu/breaking/situation-improving-in-corona-kurnool-district-with-more-people-getting-discharged-than-new-cases/

కర్నూలు ఓల్డ్ టవు్ న్ ఏరియా కు చెందిన ఈ అమ్మాయిని నంద్యాల శాంతిరామ్ మెడికల్ కాలేజీలోని క్వారంటైన్ వార్డుకు తరలించారు. 24 రోజుల తర్వాత, ఆమె పరీక్షలలో నెగటివ్ అని తేలడంతో మంగళవారం నాడు ఆసుపత్రినుంచి విడుదల చేశారు.
కర్నూల్ వన్ టైన్ ఏరియా లేదా ఓల్డ్ టవున్ ఏరియా రెడ్ జోన్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చినకేసులిక్కడ ఎక్కువ. ఇలా ఢిల్లీకేసులతో సెకండరీ కాంటాక్ట్ గా ఈ అమ్మాయిని గుర్తించారు. ఏప్రిల్ రెండోవారంలో ఆమెను కర్నూలుకు 60 కిమి దూరాన ఉన్న నంద్యాలలోని క్వారంటైన్ వార్డుకు తరలించారు. అక్కడి పరీక్షలో ఈ అమ్మాయి పాజిటివ్ అని తేలింది. అక్కడ ఆమెకు 24 రోజుల చికిత్స జరిగింది.
అయితే, పాజిటివ్ గా అంతా పెద్ద వాళ్లు మాత్రమే ఉండే వార్డుకు వచ్చి ఈ అమ్మాయిలో ఎలాంటి భయమూ భీతి కనిపించలేదు.తల్లితండ్రులకోసం ఏడ్వలేదు. ధైర్యంగా క్వారంటైన్ ఒంటిరీజీవితాన్ని స్వకరించింది. డాక్టర్లకు, నర్సులకు బాగా సహకరించింది అని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మాధవీలత న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు చెప్పారు. 24 గంటలూ ముఖ్యానికి మాస్క్ తగిలించుకోవాలి, ప్రతిసారి చేతులు కడుక్కుంటూ ఉండాలి. చేతులు ముఖం మీదకు అలవాటు ప్రకారం పోయి తాకకుండా చూసుకోవాలి. తన ఆహారం తనే తీసుకోవాలి. ఇంటి దగ్గిర తల్లి ఆలనా పాలన లో పెరిగిన చిన్న పిల్ల ఇపుడు పెద్ద మనిషిలాగా  తన పనులు తాను చేసుకుంటూ పోవాలి, అదీ క్రమం తప్పకుండా. మూడేళ్ల చిన్న పాపకు ఇది ఎంత కష్టమో వూహించవచ్చు. ఈ జీవితాన్ని వన్ టౌన్ అమ్మాయి .అధిగమించింది. అజేయంగా తిరిగొచ్చింది.

https://trendingtelugunews.com/telugu/breaking/dip-in-the-corona-cases-in-kurnool-district-of-andhra-pradesh/

మూడేళ్ల చిన్న పాపకి తల్లితండ్రులు సమీపంలో లేనపుడు వైద్యం చేయడం చాలా కష్టం, అందునా కోవిడ్ -19 పేషంటయినపుడు మరీ కష్టమని తిరుపతి స్విమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ రామ్ చెప్పారు.‘ సాధారణంగా పిల్లలు చాలా అదుపుచేయడం కష్టం కాబట్టి వారికి వైద్యం చేయడమే కష్టం. ఇక కోవిడ్ జబ్బు ఉన్నపుడు పరిస్థితి మరీ కష్టంగా ఉంటుంది. కోరానవైద్యం పెద్దలకైనా పిల్లలకైనా ఒకటే. 98 శాతం వారికి వీరికి ఒకటై వైద్యం. పిల్లలకు కూడా మందు పెద్దల్లాగే ఎక్కువ మోతాదులోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇకవారిచేత తల్లితండ్రులు అందుబాటులో లేనపుడు కరోనా ప్రొటొకోల్ పాటించేలా చేయడం అంటే రెగ్యలర్ గా చేతులు కడుక్కుంటూ ఉండమని చెప్పడం, మాస్క్ వేసుకోమని చెప్పడం, ముఖాన్ని చేతులతో తాకవద్దని చెప్పడం – చాలాకష్టం, అని డాక్టర రామ్ చెప్పారు.
ఇన్ని కష్టాలున్నా, కర్నూలు పాప జిటిలమయిన కరోనా ప్రొటొకోల్ గురించి భయపడలేదు. అన్నినియమాలను పాటిస్తూ చాలా బాగా సహకరించిందని డాక్టర్ మాధవీలత చెప్పారు.
జిల్లా కలెక్టర్ వీర పాండియన్ కర్నూల్ వన్ టౌన్ పాప ధైర్యాన్ని ప్రశంసించారు.