(డాక్టర్ అర్జా శ్రీకాంత్,స్టేట్ నోడల్ అధికారి Covid-19)
రాను రాను దేశం లో కోవిడ్ బాధితులు సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా తక్కువ సమయంలో తక్షణ వైద్య సేవల సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ ద్వారా ప్రత్యేక రైలు ను ఏర్పాటు చేసింది. ఈ రైలులోని బోగీలను తాత్కాలిక కోవిడ్ 19 చికిత్స కేంద్రాలుగా మార్చి ప్రజలకు వివిధ స్టేషన్ లో చికిత్స అందిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లోని 9 స్టేషన్లలో ఈ రైలు అందుబాటులోకి వస్తున్నది.
కేంద్ర రైల్వే శాఖ ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న కోవిడ్ సమస్యకు తమవంతు సేవగా రైల్వే బోగీలను తాత్కాలిక కోవిడ్19 కేర్ సెంటర్ గా మరియు కోవిడ్ చికిత్స కేంద్రాలుగా మారుస్తున్నది. కరోనా అనుమానితులకు లేదా స్వల్ప లక్షణాల (mild) తో బాధపడే రోగులకు అవసరమైన అదనపు బెడ్ ల సౌకర్యం కల్పించి చికిత్స అందిస్తున్నది.
ఈ కార్యక్రమం లో భాగం గా దేశవ్యాప్తంగా సుమారు 215 రైల్వే స్టేషన్లలో ఒక ప్రత్యేక రైలు ను ఏర్పాటుచేస్తారు. ఈ రైలు బోగీలను కేంద్ర ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ చికిత్స కు అనువుగా మార్పు చేశారు.
దీనికి సంబంధించి కేంద్ర రైల్వే అధికారులు స్థానిక రాష్ట్ర నోడల్ అధికారులతో నిరంతర సంప్రదింపులు జరిపారు. రాష్ట్రం లో అవసరమైన చోట ఈ ప్రత్యేక రైలు లో కోవిడ్ హెల్త్ సెంటర్ లేదా కోవిడ్ చికిత్స కేంద్రం లను ఏర్పాటు చేసి స్థానిక అధికారులకు అప్ప గిస్తారు.
ఈ బోగీలలో ఆక్సిజన్, పడకలు, దుప్పట్లు మరియు ఇతర అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కోవిడ్ అనుమానితులు మరియు కోవిడ్ నిర్ధారించబడిన వ్యక్తులకు వేరు వేరుగా కోచ్ లను ఏర్పాటు చేస్తారు.
ఈ కోవిడ్ చికిత్స కోచ్ లలో క్యాబిన్ కి ఒక కోవిడ్ రోగిని అనుమతిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భం లో క్యాబిన్ కు ఇద్దరినీ అనుమతిస్తారు.
దేశం లో సుమారు 85 స్టేషన్లలో ఏర్పాటు చేయబడిన కోవిడ్ చికిత్స బోగీలలో రైల్వే శాఖ వైద్య సిబ్బంది చే సేవలు అందిస్తారు.
ఈ కోవిడ్ రైలును స్థానిక డేడికేటెడ్ కోవిడ్ ఆసుపత్రికి అనుసంధానము ఉండేలా చూస్తారు
ఒకవేళ ఈ రైలులో చికిత్స పొందుతున్న వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో స్థానిక కోవిడ్ ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు గాను ఉండే ఆక్సిజన్ సౌకర్యం గల అంబులెన్స్ ని సైతం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఈ ప్రత్యేక రైలు కోవిడ్ కేంద్రం లో పనిచేసే వైద్య సిబ్బంది స్థానిక జిల్లా వైద్య అధికారి లేదా స్థానిక రాష్ట్ర నోడల్ అధికారి ఆధ్వర్యం లో పని చేయటం జరుగుతుంది
ఇక ప్రత్యేక కోవిడ్ రైలు ని ఎక్కడ నిలబడిందో అక్కడ స్థానిక రైల్వే సిబ్బంది రైలు కు కావలసిన ఎలెక్టికల్ రిపేర్లు గాని చిన్న చిన్న మరమ్మతులు చేస్తారు.
అవసరమైన చోట భోజన వసతి ఏర్పాట్లు కొరకు IRCTC బాధ్యత తీసుకుంటుంది. అలాగే రైల్వే రక్షక దళం బోగీలలో చికిత్స తీసుకునే రోగులకు, చికిత్స అందించే వైద్యులకు మరియు ఇతర సహాయ సిబ్బంది యొక్క రక్షణ బాధ్యతలు నిర్వహిస్తుంది.
స్టేషన్ లో కోవిడ్ రైలుఎక్కడుందో ప్రజలు సులభంగా గుర్తుపట్టేందుకు చే సూచీలు మరియు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తారు.
బోగీలలో ఉష్ణోగ్రతలు పెరగకుండా తగిన చర్యలు చేపడతారు.
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈ ప్రత్యేక కోవిడ్ చికిత్స రైలు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, పలాసా, విజయనగరం, రేణిగుంట, మంత్రాలయం రోడ్, కొండాపురం(కడప), దిగువ మెట్ట స్టేషన్లలో లో అందుబాటులో ఉంటుంది.
చికిత్సలు ముగిశాక ట్రైన్ ను తిరిగి రైల్వే శాఖ కు అందించే సమయం లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సూచించబడిన మార్గదర్శకాలు ప్రకారం ఈ ప్రత్యేక రైలు ను క్రిమి రహితం చేయడం జరుగుతుంది.