ఎన్నో సంవత్సరాల నుండి తాగునీరు, సాగునీరు లేక రాయలసీమ జిల్లాల్లో ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
వర్షం మీద ఆధారపడి పంటల ను పెట్టి ఆ పంటలకు సరైన సమయంలో వర్షాలు రాక పంటలు ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు కూడా పొగుట్టుకొని అనేకమంది రైతులు తమ జీవితాలను పొగుట్టుకొన్నారు.
ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణా జలాలను రాయలసీమ జిల్లా లకు తీసుకుని రావడానికి పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ ద్వారా 80 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ జిల్లా కు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ పథకానికి ఆర్థిక అనుమతులను వెంటనే ఆమోదించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న సందర్భంగా రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాల నాయకులు ప్రభుత్వం కు సహకారాన్ని అందించాలని అన్ని పార్టీల నేతల ను అభ్యర్తిస్తున్నా.
ఆ పార్టీ ల అధ్యక్షులకు ,కార్యదర్శి లకు ఒక లేఖ కూడా రాయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న రాజకీయ లకు అతీతంగా మద్దతు ఇవ్వాలని ఇలాంటి సందర్భంలో అందరూ కలసి తెలంగాణ కుట్రలను ఛేదించాలని విజ్ఞప్తి చేస్తూ.తెలంగాణ ముఖ్యమంత్రి కి కూడా ఒక హెచ్చరిక ఇస్తున్నాము.
గత వర్ష కాలంలో ఎన్నిటిఎంసి ల నీరు సముద్రం లో కలసి పోయిందో ఒక సారి లెక్కలు తీస్తే తెలుస్తుంది. కేవలం రాజకీయాల కోసం మీ రాష్ట్రంలో ఉన్న నాయకుల సంఘాల మాటలు వినకుండా. తెలంగాణ కంటే ఎంతో వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి కృష్ణ జలాలను ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకొని రావడానికి చేస్తున్న కృషి ని అభినందించాలని, ఇలాంటి ప్రజాప్రయోజనాల కోసం పని చేసే ముఖ్యమంత్రి కి తెలంగాణ ముఖ్యమంత్రి సహకారాన్ని అందించాలని ఒక రాయలసీమ బిడ్డగా విన్నవించు కొంటున్నాను.
ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయం పట్ల రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు చిత్తశుద్ధి తో సహకారాన్ని అందించాలి. ఇది ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్న రాయలసీమ ప్రజలు కోరిక. అది నెరవేరాలి. ఒక ప్రాంతంలో అన్ని రకాలుగా అభివృద్ధి నీటి ద్వారా నే జరుగుతుంది అనే విషయాన్ని అందరూ గ్రహించి ఇలాంటి మంచి నిర్ణయాని పట్ల ప్రజల మద్దతు కూడా అవసరం.
ఆ విధమైన సహకారాన్ని అందించ డానికి రైతు ల పక్షాన పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల మద్దతు, రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ద్వారా కూడగట్టుకొని ప్రభుత్వం కు పూర్తి మద్దతు ఇస్తాము.
(పోతుల నాగరాజు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అనంతపురం జిల్లా)