టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లో రానా ఒకడు. నితిన్, ప్రభాస్, రానా లు ఎప్పుడు సింగిల్ స్టేటస్ నుండి ఎంగేజ్డ్ స్టేటస్ పెడతారా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ టాలీవుడ్ హీరోలు వరుసగా తమ లవ్ స్టోరీలను రివీల్ చేస్తూ వస్తున్నారు.
నితిన్ ఎంగేజ్మెంట్ తో తన లవ్ స్టోరీ బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ఇదే కోవలోకి రానా కూడా చేరిపోయాడు. రానా తన లవర్ తో ఉన్న ఫోటోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ “అండ్ షీ సెడ్ ఎస్” అంటూ ఆమె తన ప్రేమని అంగీకరించింది అని స్పష్టం చేసాడు.
కాగా రానా ప్రేయసి ప్రముఖ మోడల్ మిహీక్ బజాజ్ అని తెలుస్తోంది. ఆమె డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోస్(dew drop design studios) రన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బల్లాల దేవుడు సింగిల్ నుండి రిలేషన్ షిప్ స్టేటస్ పెట్టేసాడు. మరి బాహుబలి ఈ ట్రాక్ లోకి ఎప్పుడు వస్తాడో వేచి చూడాలి.
And she said Yes 🙂 ❤️ pic.twitter.com/iu1GZxhTeN
— Rana Daggubati (@RanaDaggubati) May 12, 2020
మెగాస్టార్ అభినందన
Congratulations my Boy @RanaDaggubati Finally the mighty #BhallalaDeva is struck by #Cupid & Getting hitched. #Lockdown leads to #WedLock. God Bless You Both! శతమానం భవతి. @MiheekaBajaj pic.twitter.com/fDdHbjhivz
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 12, 2020