మహారాష్ట్రలోని థానే నుండి కర్నూలుకు తీసుకువస్తున్న వలస కూలీలలో కొందరికి కరోనా పాజిటివ్ కనిపించింది. 930 మంది కూలీలు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. వారందరిని ఒక స్పెషల్ ట్రైన్ లో 930 గుంతకల్ రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చారు. అక్కడినుంచి వీరిని అనంతపూర్, కర్నూలు కడప జిల్లాలోని వారి వారి వూర్లకు తరలించాల్సి ఉంది.
వీరిలో 250 మందిని పరీక్షించగా 38 మందికి(కర్నూలుకు చెందిన 37 మందికి , కడపకు చెందిన ఒకరికి ) పాజిటివ్ వచ్చింది.
వీరందరినీ క్వారంటైన్ సెంటర్లో చేర్పించామని రాష్ట్ర కరోనా నోడల్ అధికారి డాక్టర్ అర్జా శ్రీకాంత్ వెల్లడించారు.
క్లస్టర్ కంటైన్మెంట్ స్ట్రాటజీ వీరికి అవసరం లేదని ఆయన చెప్పారు.
వీరందరూ ముంబై లో గల మసీద్ బండారి ఫిష్ మార్కెట్ లో లేబర్ గా పనిచేసి వచ్చినట్లుగా గుర్తించారు.
వీరందరికీ తగిన వైద్యాన్ని అందిస్తామని ఆయన చెప్పారు.