తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 79 కొరొనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ ఆంక్షలను సడలించేందుకుప్రయత్నాలు జరుగుతున్నపుడు పాజిటివ్ కేసులు కొద్దిగా పెరగాయి. అయితే, ఈ కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటం మరొక విశేషం. ఈ రోజు రాష్ట్రంలో 50 మంది కరోనా ఇన్ ఫెక్షన్ కు చికిత్స తీసుకుని డిచార్జ్ అయినట్లు వైద్య శాఖ వెల్లడించింది. ఈమేరకుఒక బులెటీన్ విడుదల చేసింది. ఈ రోజు 79 మంది కేసులు రావడంతో రాష్ట్రం మొత్తం కేసుల సంఖ్య 1275 కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 444 ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
డిశ్చార్జ్ అయిన వారిలో కూడా జిహెచ్ ఎంసి వారే ఎక్కువ. 50 మంది లో 42 మంది జిహెచ్ ఎంసి ఉంటే, నలుగురు సూర్యాపేట జిల్లాకు చెందిన వారు. మిగతా వారంతా ఇతర జిల్లాలకు చెందిన వారు.