రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను మరింత సడలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చాలా మంది ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో, హైదరాబాద్ ఉద్యోగాలు చేస్తున్న వారు ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాలో లాక్ డౌన్ వల్ల చిక్కుకు పోయారు. రెండు రాష్ట్రాల మధ్య ఇలా చిక్కుకుపోయిన వారిని వారివారి ప్రాంతాలకు అనుమతించే విషయాన్ని ఆంధ్రప్రదేశ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. రెండుమూడురోజులలో దీని మీద ఒక ప్రకటన వెలవడే అవకాశం ఉంది.
రాష్ట్రంలో కోరానా కేసుల ట్రెండ్ ఆందోళనను తగ్గించింది. కొత్త కేసులు కేవలం కంటైన్ మెంట్ జోన్లకే పరిమితం కావడం, కొత్తగా నమోదవుతున్నవారి కంటే, ఆసుప్రతుల నుంచి డిశ్చార్జ్ అవుతున్నవారే ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను మరింత సడలించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉందని తెలిసింది.
కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాల నిర్వహాణకు కసరత్తు ప్రారంభమయింది..
ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు అంటే మూడు గంటల పాటు ఉన్న లాక్ వెసులుబాటు సమయాన్ని ఇంకా పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు అన్ని రకాల దుకాణాల తెరిచే ఉంచేలా సడలింపునకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
సరి బేసి సంఖ్యలో దుకాణాలు విభజించి (అంటే బజార్లో ఒకటి మార్చి మరొకటి ఒక్కొక్క రోజు తెలిచేలా) కార్యాకలాపాల నిర్వహాణకు ప్రణాళికలు సిద్దం మవుతున్నదని తెలిసింది. ప్రభుత్వం సూచించే విధంగా దుకాణాలను క్రమపద్దతిలో తెరిచేలా చూసే బాధ్యతలను స్థానిక కార్పోరేషన్లు మున్సిపాల్టీలకు అప్పగిస్తారు.