మొన్న ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా విరుచుకుపడటం , ముఖ్యంగా దాడిని పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద గురిపెట్టడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
కెసిఆర్ తన సహజ శైలిలో కాంగ్రెస్ పిసిసి నేత పేరెత్తకుండా చురకలంటించారు. ఇపుడు కెసిఆర్ విమర్శలకు సమాధానం చేప్పేందుకు, అసలు కెసిఆర్ చెప్పేవన్నీ కబుర్లు తప్ప అందులో నిజం లేదని చెప్పేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తూఉంది.
ఈ రోజు మాజీ టీఆరెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత కాంగ్రెస్ నేత, రాములు నాయక్ కెసిఆర్ మీద వ్యంగ్యాస్త్రం సంధించారు. మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాటలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
ఆయన మాటల్లో…
ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడిన మాటలు వింటే చాల బాధేస్తుంది.
ఈ రోజు చిల్లర రాజకీయాలు చేస్తున్నది పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు కేసీఆరే
ఉత్తమ్ కుమార్ సైనికుడు, అలాంటి సైనికుడిని బ్రోకర్ అంటావా ..?